కారుణ్య నియామకం కోసం ఓ వ్యక్తి ఇచ్చిన వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలను అమలు చేయనందుకు… విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి(tspsc chairman)పై హైకోర్టు(telangana high court) ఆగ్రహం వ్యక్తం చేసింది. సందీప్ కుమార్ సుల్తానియా, జనార్దన్ రెడ్డికి హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఇద్దరినీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
తన తండ్రి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ 2010లో మరణించారని.. కారుణ్య నియామకం కింద తనకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని… ఫరూఖీ అనే వ్యక్తి విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫరూఖీకి 15 ఏళ్లే ఉన్నాయన్న కారణంగా దరఖాస్తును నిరాకరించారు. తనకు కొన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇచ్చిన మరో దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో… 2017 కోర్టును ఆశ్రయించి ఫరూఖీ వేసిన పిటిషన్ను సింగిల్ జడ్జి కొట్టివేయడంతో ధర్మాసనాన్ని(telangana high court) ఆశ్రయించారు.