తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. 600 దాటిన కొత్త కేసులు - corona cases update
19:49 July 08
మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 608 మందికి వైరస్
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 600 దాటాయి. తాజాగా 608 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనితో ఇప్పటి వరకు 8,05,137 మంది వైరస్ భారీన పడ్డారు. మరో 459 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 7,95,880 మంది కొవిడ్ నుంచి కొలుకున్నారు. దీనితో ప్రస్తుతం రాష్ట్రంలో 5,146 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇక తాజాగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 5, హైదరాబాద్ 329, జగిత్యాల 6, జనగామ 7, గద్వాల 1 , కరీంనగర్ 10, ఖమ్మం 11, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 8, మహబూబాబాద్ 4, మంచిర్యాల 5, మెదక్ 1 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 54, నాగర్ కర్నూల్ 2, నల్గొండ 7, నారాయణపేట్ 4, నిజామాబాద్ 10, పెద్దపల్లి 12, సిరిసిల్ల 4, రంగారెడ్డి 67, సంగారెడ్డి 16, సిద్దిపేట 6, వికారాబాద్ 7, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 2, యాదాద్రి 6 చొప్పున నమోదయ్యాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి:Loan apps: రుణయాప్‌ల వేధింపులు.. డబ్బు ఎరవేసి బాధితులకు చుక్కలు