తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Constable Appointments Stopped : కానిస్టేబుల్ అభ్యర్థులకు షాక్‌.. నియామక ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ - కకానిస్టేబుల్ తుది ఫలితాలపై కోర్టు ఆదేశాలు

Telangana Constable Appointments Stopped : రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు తాాత్కాలిక బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు నియామక మండలి అధికారులు మార్కులను కలిపే ప్రక్రియపై కసరత్తు చేయకుండానే అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షలను నిర్వహిస్తోందంటూ పిటిషనర్లు మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో మండలి అక్టోబరు 4న విడుదల చేసిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు గురువారం ఆదేశించింది.

Constable Selection Process
Break To Constable Selection Process

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 1:56 PM IST

Telangana Constable Appointments Stopped : కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షల నిర్వహణను సంబంధిత అధికారులు ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ మేరకు పోలీస్​ కమిషనర్లకు, ఎస్పీలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్​ఎల్​పీఆర్​బీ) సూచన చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే శారీరక సామర్థ్యం, రాత పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్వాపరాల పరిశీలనతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Telangana HC Puts a Break To Constable Appointments :ఈ పరీక్షల అనంతరం శిక్షణకు పంపించేందుకు మండలి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తుది ఎంపిక సరిగా జరగలేదని పలువురు అభ్యర్థులు కొద్ది రోజుల క్రితం కోర్టును ఆశ్రయించారు. ప్రశ్నాపత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో అభ్యర్థులకు నాలుగు మార్కులను కలిపాలని కోర్టుకు తెలిపారు. ఈ మేరకు కోర్టు తుది పరీక్ష రాసినఅభ్యర్థులకు నాలుగు మార్కులను కలిపి అనంతరం మరోసారి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయాలని అక్టోబరు మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana HC on Civil Constable Appointment : సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు బ్రేక్.. ఆ 4 ప్రశ్నలు తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు

Telangana High Court On Constable Final Results 2023 :అయితే నియామక సంబంధిత అధికారులు మార్కుల్ని కలిపే ప్రక్రియపై కసరత్తు చేయడం లేదని.. అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలనతో పాటు వైద్య పరీక్షలనూ నిర్వహిస్తోందంటూ పిటిషనర్లు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో మండలి అక్టోబరు 4న విడుదల చేసిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు గురువారం ఆదేశించింది.

కానిస్టేబుల్​ నియామక పరీక్ష తుది ఫలితాలు అక్టోబరు 4న విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను టీఎస్​ఎల్​పీఆర్​బీ విడుదల చేసింది. 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి.. వారికి సంబంధించిన వివరాలను నియామక మండలి వెబ్​సైట్​లో పెట్టినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్లలో పొందుపరిచినట్లు వెల్లడించింది. అలాగేకటాఫ్​ మార్కుల వివరాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

TSLPRB Focus On Police Candidates Training : అక్టోబర్​లో కానిస్టేబుళ్లకు శిక్షణ! 28 కేంద్రాల్లో ఏర్పాట్లు

సివిల్​ కానిస్టేబుల్​ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల్లో కొన్ని తెలుగులోకి అనువాదం చేయకపోవడం వల్ల తాము నష్టపోయామని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆంగ్ల పదాలను తెలుగులోకి అనువాదం చేసే అవకాశం ఉన్నా.. పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. అనువాదం చేయలేని ఆ నాలుగు ప్రశ్నలను పరీక్షలో నుంచి తొలగించి.. ఆ తర్వాత మూల్యాంకనం చేయాలని ఆదేశించింది.

TS Police Results 2023 : పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

Telangana Constable Results Released 2023 : కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు వెల్లడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details