తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Constable Results Released 2023 : కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు వెల్లడి - TSLPRB Latest News

Telangana Constable
tslprb

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 7:36 PM IST

Updated : Oct 4, 2023, 10:13 PM IST

19:28 October 04

15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక

Telangana Constable Results Released 2023 :రాష్ట్రంలో నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పరీక్ష (Constable Results) తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను టీఎస్​ఎల్​పీఆర్​బీ విడుదల చేసింది. 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన వివరాలను నియామక మండలి వెబ్​సైట్​లో వ్యక్తిగత లాగిన్లలో పొందుపరచనున్నట్లు వెల్లడించింది. అలాగే కటాఫ్ మార్కుల వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.

Telangana SI Results Released : తెలంగాణ ఎస్​ఐ తుది ఫలితాలు విడుదల

TS Constable Results 2023 :అయితే పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు.. అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం తర్వాత వెల్లడిస్తామని టీఎస్​ఎల్​పీఆర్​బీ (TSLPRB) స్పష్టం చేసింది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తుది ఎంపిక జాబితాలో చోటు దక్కిన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో.. అటెస్టేషన్ పత్రాలను ఈనెల 7 నుంచి 10 తేదీ లోపు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. వాటిని డిజిటల్​గా పూరించిన అనంతరం.. డౌన్​లోడ్​ చేసుకొని.. వాటిపై పాస్​పోర్ట్​ సైజ్ ఫోటోలను అతికించాలని పేర్కొంది.

TSLPRB has Released Constable Results 2023 : మూడు సెట్లపై గెజిటెడ్ అధికారి సంతకాలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి సూచించింది. ఆయా పత్రాలను ఈనెల 12, 13 తేదీల్లో నిర్ణీత కార్యాలయాల్లో సమర్పించాలని పేర్కొంది. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులు తాము ఎంపికైన జిల్లా ఎస్పీ కార్యాలయం లేదా కమిషనరేట్లలో,.. ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్-సీపీఎల్, రవాణా కానిస్టేబుల్(ప్రధాన కార్యాలయం) అభ్యర్థులు.. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో, టీఎస్ఎస్పీ, ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఫైర్​మెన్​, ఎక్సైజ్, వార్డర్లు, రవాణా కానిస్టేబుల్(ఎల్సీ) అభ్యర్థులు సంబంధిత పోలీస్ జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపింది.

TS Police Results 2023 : పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

TSLPRB : కాగా తుది ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాల నివృత్తికి టీఎస్​ఎల్​పీఆర్​బీ అవకాశం కల్పించింది. ఈనెల 5న ఉదయం 8 గంటల నుంచి.. 7న సాయంత్రం 5 గంటల వరకు వెబ్​సైట్​లోని వ్యక్తిగత లాగిన్ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1,000.. ఇతరులంతా రూ. 2,000 చెల్లించాలని పేర్కొంది. అలా దరఖాస్తు చేసిన వారికి.. కొద్ది రోజుల్లో ఆన్​లైన్​లోనే తిరుగు సమాధానం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో ఎలాంటి వ్యక్తిగత వినతులను నేరుగా ఇవ్వడాన్ని అంగీకరించబోమని టీఎస్​ఎల్​పీఆర్​బీ స్పష్టం చేసింది.

Telangana SI Results Released : ఇటీవలే తెలంగాణ ఎస్సై, ఏఎస్‌ఐ పోస్టుల తుది ఎంపిక ఫలితాలను.. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి విడుదల చేసింది. 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళలను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులు, కేటగిరీ వారీ వివరాలను వెల్లడించింది. గత సంవత్సరం ఆగస్టు 7న ప్రాథమిక రాతపరీక్షతో ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.

GO 46 Controversy Telangana : TSSP నియామకాల్లో మంటలు రేపుతున్న జీవో 46

TSLPRB Focus On Police Candidates Training : అక్టోబర్​లో కానిస్టేబుళ్లకు శిక్షణ! 28 కేంద్రాల్లో ఏర్పాట్లు

Last Updated : Oct 4, 2023, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details