తెలంగాణ

telangana

ETV Bharat / state

' ప్రభుత్వం మహిళా కమిషన్​ను నిర్వీర్యం చేస్తోంది'

తెలంగాణ కాంగ్రెస్​ మహిళా నేతలు రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లిన్నట్లు మహిళా నేతలు తెలిపారు.

Telangana Congress Women Leaders  Meet Governor
Telangana Congress Women Leaders Meet Governor

By

Published : Nov 27, 2019, 5:15 PM IST

Updated : Nov 27, 2019, 5:22 PM IST

తెలంగాణలో స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త, మానవ హక్కుల, మహిళా కమిషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో వారు గవర్నర్​ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన్నట్లు తెలిపారు. కొన్నాళ్లుగా ఛైర్మన్‌లను నియమించికుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆర్టీసీ సమ్మె అంశాన్ని గవర్నర్‌కు వివరించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఇందిరా శోభన్ తెలిపారు. ఆర్టీసీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించానని... కార్మికులకు అండగా ఉంటానని ఎవరూ అధైర్యపడవద్దని గవర్నర్ చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మహిళా నేతలు కాట సుధారాణి, శ్రీదేవి, శైలజ, రమా, రూప, కీర్తి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Last Updated : Nov 27, 2019, 5:22 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details