తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress Vijayabheri Bus Yatra : నేడు సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ బస్సు యాత్ర.. ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే

Telangana Congress Vijayabheri Bus Yatra : కర్ణాటకలో అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలను చూపించేందుకు తాము సిద్ధమని.. కేసీఆర్, కేటీఆర్​లకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల అమలు జరిగి తీరుతుందని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ చెబుతున్నారని.. అధికారంలో ఉండగా స్వాహా చేసిన సొమ్మును కక్కిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 7:03 AM IST

Telangana Congress Vijayabheri Bus Yatra
Telangana Congress

Telangana Congress Vijayabheri Bus Yatra నేడు సంగారెడ్డి మెదక్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ బస్సు యాత్ర ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే

Telangana Congress Vijayabheri Bus Yatra :రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగావిజయభేరి యాత్ర(Congress Vijayabheri Yatra) శనివారం తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో సాగింది. రోడ్‌ షోలో పాల్గొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గుర్తించి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని.. కృతజ్ఞతగా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీలు అమలు జరగడం లేదని చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టిన శివకుమార్‌.. కేసీఆర్‌, కేటీఆర్‌ వచ్చినా చూపించేందుకు సిద్ధమని సవాల్‌ విసిరారు.

DK Shivakumar Speech in Congress Bus Yatra : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పట్ల కృతజ్ఞత చూపాలి : డీకే శివకుమార్​

'పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌... మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఇక ఆయన సమయం ముగిసింది. కాంగ్రెస్‌ అధికారంలో రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం. కర్ణాటకలో మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని బీఆర్​ఎస్​ నేతలు, కేటీఆర్‌ చెబుతున్నట్లుగా సోషల్‌ మీడియా, మీడియాలో చూశాను. కేసీఆర్‌, కేటీఆర్‌ మీ బృందాన్ని పంపినా, లేకుంటే మీరే వచ్చినా బస్సు ఏర్పాటు చేస్తాం. సరిహద్దులోని ఏ గ్రామానికైనా వెళ్దాం. ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్న విషయాన్ని చూపిస్తాను. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క నాయకత్వంలో సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.' -డీకే శివకుమార్‌, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి

Congress 2nd Phase Vijayabheri Bus Yatra :రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) అబద్ధాలు చెబుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. రోజుకు 8 నుంచి 10 గంటలకు మించి వ్యవసాయానికి కరెంట్ ఇవ్వడం లేదని నిరూపించేందుకు సిద్ధమని ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కేసీఆర్​కు ముందే తెలిసిందని.. అందుకే ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని చెబుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ సర్కార్‌ హయాంలో జరిగిన అవినీతి బయటపెడతామన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని రేవంత్‌ తెలిపారు.

Telangana Congress Bus Yatra Today Schedule : ఇవాళ సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో జరిగే విజయభేరి యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ అనంతరం సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్లి అక్కడ సభలో పాల్గొననున్నారు.

Revanth Reddy Speech in Bus Yatra Parigi : తెలంగాణ ప్రజలు కేసీఆర్​ను సామాజిక బహిష్కరణ చేసే రోజు దగ్గరలోనే ఉంది : రేవంత్​రెడ్డి

Rahul Gandhi Speech at Mortad : 'రాష్ట్రంలో బీజేపీ ఖతమ్ అయింది.. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details