Telangana Congress Speed up In Election Campaign : రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఎక్కుపెడుతున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులు ఏఐసీసీ ప్రతినిధులు కేసీఆర్, కేటీఆర్ విమర్శలపై ఎదురు దాడి చేస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొదటిసారి సర్వేలు చేసిన కాంగ్రెస్.. సునీల్ కనుగోలు టీం నియోజకవర్గాల వారీగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 119నియోజకవర్గాలకుగాను దాదాపు 25 నియోజకవర్గాల్లో పార్టీ ఆశించినంత బలంగా లేనట్లు సర్వేలు స్పష్టం చేశాయని సమాచారం.
ఉప్పల్ పోరు- గెలుపు వ్యూహాల్లో నిమగ్నమైన ప్రధాన పార్టీలు
ప్రధానంగా నియోజకవర్గాలల్లో పార్టీ ,అభ్యర్థుల బలాబలాలను మేనిఫెస్టో, ఆరు గ్యారెంటీలకు (Congress Six Guarantees) సంబంధించి అభిప్రాయాలను సర్వే ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం. దాదాపు 25 నియోజకవర్గాలలోకాంగ్రెస్ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర నాయకత్వం ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనాయకుల ప్రచారంతోపాటు ఇంటింటికీ కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto), 6 గ్యారంటీలను చేరవేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Congress Top Leaders Election Campaign : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్(Rahul Gandhi) , ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కలిసి ఇప్పటివరకు 50 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేసినట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ 50 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 30 నియోజకవర్గాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మిగిలిన మరో 69 నియోజకవర్గాల్లోప్రచారం చేయాల్సిఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ 69 నియోజకవర్గాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 20 వరకు ప్రచారం చేయనుండగా మిగిలిన 39 నియోజకవర్గాల్లో రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రముఖులు ప్రచారం నిర్వహించనున్నారు.
రాష్ట్రానికి 24న మరోసారి ప్రియాంక గాంధీ రాక- మూడు రోజులు, పది సభలు