కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ... కీలక చర్చ - Telangana congress party today news
హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. త్వరలో జరగబోయే సహకార సంఘాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు, త్వరలో జరగబోయే సహకార సంఘాల ఎన్నికలే ప్రధానాంశాలుగా చర్చించేందుకు సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశానికి మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచందర్ రెడ్డి, చిన్నారెడ్డి, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ తదితరులు హాజరయ్యారు.