రాష్ట్రంలోని పేద కుటుంబాలకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. లాక్‌డౌన్ వల్ల.... ఉద్యోగాలు, ఉపాధి పోయి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. వ్యక్తిగత జీవితంతో పాటు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలపై కూడా లాక్‌డౌన్ పెను ప్రభావం చూపిందన్నారు.
విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని కోరుతూ ఇవాళ కాంగ్రెస్ ధర్నా - తెలంగాణ తాజా వార్తలు
విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, ఎంఎస్ఎంఈలకు లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మొత్తం విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో.... నాన్ టెలిస్కోపిక్ విధానంలో బిల్లులు వేసి, వినియోగదారుల నడ్డి విరచడం ఏంటని ఉత్తమ్ ప్రశ్నించారు. నేటికీ.... మెజారిటీ విద్యుత్ వినియోగదారులు తమకు అందిన బిల్లులను చెల్లించలేదన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల... విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని కోరారు. విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. మండల, పట్టణ విద్యుత్ కేంద్రాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ నుంచి విద్యుత్ సౌధ వరకు ర్యాలీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్