Congress protest:దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దాని వల్ల అన్నింటి రేట్లు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా.... దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్నారని ఆరోపించారు. ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వరకు తోపుడు బండ్లపై మోటార్ సైకిళ్లు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన తెలిపాయి. ధరలు తగ్గించకపోతే నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
గ్యాస్, చమురు ధరల పెంపును ఖండిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసనలు - tcongress protest
Congress protest: గ్యాస్, చమురు ధరల పెంపును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. తోపుడు బండ్లపై స్కూటీలను ఎక్కించి నిరసన తెలిపారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, నగర అధ్యక్షురాలు కవిత మహేశ్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ధరలను తగ్గించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జ్ఞానోదయం చేయాలని... అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సునీతా రావు హెచ్చరించారు.
ఇదీ చదవండి:పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు