తెలంగాణ

telangana

By

Published : Nov 28, 2019, 10:30 PM IST

ETV Bharat / state

'టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలి'

కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని ఆపార్టీ బీసీ నాయకులు ఏఐసీసీకి విజ్ఞప్తి చేశారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని... రిజర్వేషన్లు బీసీలకు సరిగ్గా అందుబాటులో లేకుండా ఒక అడ్డుకట్టగా మారిన క్రిమిలేయర్‌ను ఎత్తివేసేట్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు

telangana Congress party   Obc leaders  Meeting at Hyderabad
telangana Congress party Obc leaders Meeting at Hyderabad

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని ఆ పార్టీ బీసీ నాయకులు హస్తం పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ హైదరాబాద్‌ లక్డీకపూల్‌ హోటల్‌ అశోకాలో సమవేశమైన కాంగ్రెస్‌ పార్టీ బీసీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఏఐసీసీ ఓబీసీ సెల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లతోపాటు 32 జిల్లాల నుంచి పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొని తాజా పరిస్థితులపై చర్చించారు.

సమావేశంలో నాలుగు తీర్మాణాలను ఆమోదించి ఏఐసీసీకి పంపించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు​. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించటంతోపాటు టీపీసీసీ అధ్యక్ష పదవి, పార్టీలోని అన్ని స్థాయిల్లో వెనుకబడిన తరగతులకు సముచిత స్థానం కల్పించాలని తీర్మాణించినట్లు పేర్కొన్నారు. అత్యధికంగా వెనుకబడిన తరగతులు ఉన్న ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ సీఎం వ్యవహరిస్తున్న తీరును ఖండించినట్లు శ్రవణ్‌ చెప్పారు.

'టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలి'

ఇవీ చూడండి:ప్రియాంకరెడ్డి హత్యకేసు దర్యాప్తునకు 10 బృందాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details