తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress Operation Cool : ఆపరేషన్​ కూల్​.. అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్​ నయా ప్లాన్​ - INC Telangana

Telangana Congress Operation Cool : కాంగ్రెస్‌లో అసమ్మతిని చల్లార్చేందుకు ఆపరేషన్ కూల్ పేరుతో.. పార్టీ సీనియర్లను ఏఐసీసీ రంగంలోకి దింపుతోంది. టికెట్‌ రాని నాయకులు నిరాశకు లోనుకాకుండా చక్కబెట్టేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆశావహుల్లో టికెట్‌ ఎవరికి వచ్చినా.. కలిసి పని చేసేటట్లు నాయకుల్లో ఐఖ్యతను తెచ్చేందుకు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది.

Telangana Congress Latest News
T-Congress Operation Cool

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 7:15 AM IST

T-Congress Operation Cool ఆపరేషన్​ కూల్​.. అసంతృప్త నేతలకు కాంగ్రెస్​పార్టీ నయా ప్లాన్​

Telangana Congress Operation Cool :అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరిలోకి దిగేందుకు.. అస్త్ర శాస్త్రాలను కాంగ్రెస్ సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఏఐసీసీ కూడా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ల ప్రకటన సందర్భంగా.. టికెట్లు రాని నాయకుల్లో అసంతృప్తి చెలరేగకుండా.. ముందస్తు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్ధుల మొదటి జాబితా త్వరలో ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది.

Telangana Congress Election Strategy :స్క్రీనింగ్‌ కమిటీ మురళీధరన్‌ నేతృత్వంలో జరిగిన కసరత్తులో సగానికిపైగా నియోజకవర్గాలలో.. గెలుపు గుర్రాల ఎంపికపూర్తయ్యింది. అక్కడ సీఈసీ పరిశీలన తర్వాత మొదటి జాబితా ప్రకటన జరగనుంది. గట్టి పోటీ తమకంటే తమకు టికెట్ వస్తుందని అంచనా వేసుకుంటున్న నాయకుల్లో ఎవ్వరికి రాకపోయినా తీవ్ర అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుందని పార్టీ అంచనా వేస్తోంది.

కొత్తగా పార్టీలో చేరే నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ కూల్ పేరుతో మాణిక్​రావ్​ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్​ రెడ్డి(TPCC Chief Revanth Reddy) సహా.. మరి కొంతమందిని రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగేందుకు.. రెండు రోజుల క్రితం హస్తం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చింది.

Telangana Assembly Elections 2023 : అక్కడ టికెట్‌ ఆశిస్తున్న ఆశావహులను బుజ్జగించే పనిని సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తాను డిమాండ్‌ చేసిన రెండు టికెట్లు ఇచ్చేందుకు ఏఐసీసీ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఆయన, అయన కుమారుడు ఇవాళ, రేపో హస్తం కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మెదక్‌ టికెట్‌ మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు, మల్కాజిగిరి టికెట్‌ మైనంపల్లికి ఇస్తున్నట్లు సమాచారం.

BC MLA Ticket Issue in Congress Party : కాంగ్రెస్​లో బీసీ నేతల పోరుబాట.. 34 సీట్లు తమకే ప్రకటించాలని డిమాండ్

దీంతో అటు మెదక్, ఇటు మల్కాజ్​గిరి నియోజకవర్గాలల్లో టిక్కెట్లు(Telangana Congress MLA Tickets) ఆశించిన నాయకులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. మల్కాజ్​గిరి టికెట్‌ తనకే దక్కుతుందన్న విశ్వాసంతో.. చాలా కాలంగా పని చేసుకుంటూ వచ్చిన ఆ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో మల్లురవి సమావేశమయ్యారు. ఇప్పుడు ఆ టికెట్ మైనంపల్లి హనుమంతురావుకు ఇవ్వాల్సి రావడంతో పీసీసీ ఆదేశాలతో తాను కలిసినట్లు శ్రీధర్‌తో తెలిపారు.

Telangana Congress MLA Tickets 2023 : ఒకట్రెండు రోజుల్లో దిల్లీకి తీసుకెళ్లి కేసీ వేణుగోపాల్​ను కలిపించి కచ్చితమైన హామీ ఇప్పించి.. అన్యాయం జరగకుండా చూస్తానని తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు బీజేపీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కొంత మంది కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారని గడిచిన పది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం కూడా సమావేశమైన బీజేపీ నాయకులు కొందరు.. కాంగ్రెస్‌లో చేరాలని, వద్దని మరికొందరు చర్చకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం కొందరికి మాత్రమే టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ చొరవ చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దీంతో మిగిలిన వారు.. తాము ఎందుకు కాంగ్రెస్‌లో చేరాలని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే వారికి కొందరికి టికెట్లు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. పార్టీలో చేరుతున్న మాజీ ఎంపీల కోసం పెద్దపల్లి, భువనగిరి, వరంగల్‌, రాజేంద్రనగర్‌ తదితర నియోజక వర్గాలను అట్టిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా టికెట్‌ రాని సొంత పార్టీ వాళ్లే అభ్యర్థులను ఓడించేందుకు అవకాశం ఉంటుందని.. పీసీసీ అంచనా వేస్తోంది. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఎక్కడక్కడ అసమ్మతిని చల్లార్చేందుకు.. ఆపరేషన్ కూల్‌ చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Revanth Reddy on Congress Candidates Announcement : 'త్వరలోనే తొలి విడతలో సగానికిపైగా సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తాం'

Rahul On Upcoming Elections : 'తెలంగాణలో అధికారం కాంగ్రెస్​దే!.. ఆ మూడు రాష్ట్రాల్లో కూడా..'

ABOUT THE AUTHOR

...view details