తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

Telangana Congress MLC Candidates List 2024 : రాష్ట్రంలో శాసనసభ సభ్యుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇవాళ ప్రకటించనుంది. గవర్నర్ కోటా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినా న్యాయపరమైన చిక్కులు రాకుండా కసరత్తుల దృష్ట్యా ప్రకటనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దావోస్‌ పర్యటన అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్పొరేషన్లకు ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Congress MLC Candidates List Announced Today
Telangana Congress MLC Candidates List 2024

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2024, 8:07 AM IST

Updated : Jan 15, 2024, 8:48 AM IST

నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా

Telangana Congress MLC Candidates List 2024: రాష్ట్రంలో నాలుగు శాసన మండలి సభ్యుల పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, మరో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులను భర్తీకి ఎంపిక చేసిన అభ్యర్థులకు పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కే.సీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, రాజకీయ వ్యూహకర్త సునీల్ కొనుగోలుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశమై మండలి సభ్యుల అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.

గవర్నర్ కోటా కింద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, మరో మైనారిటీ నాయకుడు అభ్యర్థులుగాకాంగ్రెస్అధిష్ఠానం ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ కోటా అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే జరిగినప్పటికీ న్యాయపరమైన ఇబ్బందులు ఉండడంతో వాటిని అధిగమించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్​కే దక్కనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలు! - భారీగా ఆశావహులు

Congress MLC Candidates List Telangana 2024: శాసనసభ సభ్యుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయచటంతో ఖాళీ ఏర్పడింది. ఈ రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కాగా మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినదిగా ఉన్నది. దీంతో వీటిని భర్తీ చేసే విషయంలోనూ ఒకటి ఎస్సీ, మరొకటి ఓసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

MLA Quota MLC Elections Telangana 2024 :ఈ తరుణంలోనే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌కు అవకాశం కల్పించాలని పార్టీ యోచిస్తోంది. అదేవిధంగా ఓసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, పటేల్ రమేష్ రెడ్డి , ప్రోటోకాల్ ఛైర్మన్ హర్కర వేణుగోపాల్‌రావు పేర్లు తెరపైకి వచ్చాయి. బీసీ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ కులాల నుంచి భర్తీ చేయాలని యోచిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో గోప్యత ప్రదర్శిస్తూ వస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఈ నెల 18లోగా నామినేషన్ల దాఖలు దృష్ట్యా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ - రెండు సీట్లు కాంగ్రెస్​కే!

Congress On MLA Quota MLC Elections 2024 : మరోవైపు ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రోటోకాల్ ఛైర్మన్‌ హర్కర్ వేణుగోపాలరావు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిలకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది. వేం నరేందర్‌రెడ్డి, హర్కర్ వేణుగోపాల్‌రావులకు ప్రభుత్వ సలహాదారులుగా నియమించవచ్చని చర్చ జరుగుతోంది.

మాజీ మంత్రి చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌ ఎంపీగా బరిలోకి దిగాలని భావిస్తున్న మల్లు రవిని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా మరో 10 ముఖ్యమైన కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకానికి పార్టీ అధిష్ఠానం ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. సీఎం దావోస్‌, లండన్ పర్యటనల నుంచి వచ్చాక ఈ నియామకాలు ఉంటాయని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు - ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం!

దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి - కౌన్సిల్ సభ్యుల ఎంపిక, నామినేటెడ్ పదవులపై అధిష్ఠానంతో చర్చ

Last Updated : Jan 15, 2024, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details