Telangana Congress MLA Candidates List Delay :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైనా షెడ్యూల్(Telangana Assembly Election Schedule 2023) వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందేకాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నా అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మొదట ఈ వారంలో అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందనుకున్నా.. ఇప్పట్లో ఆ దాఖలాలు కనిపించడం లేదు.
దాదాపు 40కి పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. మరో 30 నియోజకవర్గాల్లో టికెట్ల(Congress MLA Tickets) కోసం గట్టి పోటీ ఉండడంతో మరొకసారి సర్వేలు నిర్వహించాలని స్క్రీనింగ్ కమిటీ(Screening Committee) నిర్ణయించింది. ఆ మేరకు గత నెల చివరి వారం నుంచి సర్వేలు కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన సమాచారం నేరుగా స్క్రీనింగ్ కమిటీకి చేరేట్లు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Candidates List 2023 :అయితే గత నెల 30వ తేదీన కానీ ఈనెల మూడో తేదీకానీ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం అవుతుందని పీసీసీ వర్గాలు అంచనా వేశాయి. తాజా రాజకీయ పరిణామాల వల్ల ఆ రెండు తేదీల్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగకపోగా.. మరో తేదీ ఖరారు కాలేదు. దీంతో స్క్రీనింగ్ కమిటీ ఎప్పుడు సమావేశం అవుతుందో స్పష్టత లేదని చెప్పొచ్చు.
Telangana Congress MLA Candidates List 2023 : ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. మరో వారంలో జాబితా
Delay in Telangana Congress MLA List 2023 :ఈ నెల 7వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం(Central Election Committee Meeting) ఉండే అవకాశాలు ఉన్నట్లు మొదట అంచనా వేసినప్పటికీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల రెండో వారంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుందనికాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిటీ తేదీ ఖరారు అయిన వెంటనే ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశమై మొదటి జాబితా(Congress MLA Candidates First List)కు సంబంధించి దాదాపు 70 పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Congress MLA Candidates First List 2023 :ఫ్లాష్ సర్వేలు నిర్వహించిన సూర్యాపేట, జనగామ, ఖైరతాబాద్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, మిర్యాలగూడ, భువనగిరి తదితర 27 నియోజకవర్గాలల్లో సర్వేలు జరిగినట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడాఅభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం కావడం పార్టీ గెలుపుపై ఆ ప్రభావంతీవ్రంగా చూపినట్లు రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తుంది. అలాంటప్పుడు ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన చేయాలని భావిస్తున్నప్పటికీ అవకాశాలు కనిపించడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలు తేదీ ఆలస్యం అయ్యేటట్లయితే షెడ్యూల్ కన్నా ముందే మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Telangana Congress Disputes 2023 : కాంగ్రెస్ పార్టీలో గందరగోళం.. చేరికలతో అయోమయంలో సీనియర్ నేతలు
BC MLA Ticket issue in Congress Telangana : బీసీలకు 34 సీట్లు.. రాష్ట్ర నేతల డిమాండ్‌పై ఏఐసీసీ ఫైర్