Telangana Congress MLA Candidates List Delay : రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు.. ఈ వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ (Telangana Congress) ఇంకా తుది నిర్ణయం తీసుకోలేక పోతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన హస్తం పార్టీ... పూర్తి పారదర్శకంగా ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Tickets Issue : కాంగ్రెస్ ఆర్నెళ్లుగా సర్వేలపై సర్వేలు నిర్వహిస్తూ వస్తోంది. పార్టీ పరంగానే కాకుండా.. నాయకుల వారీగా ఈ సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ పర్యవేక్షణలో జరిగిన సర్వేలతోపాటు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సర్వేలు, కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు (Sunil Kanugolu)సర్వేలు, డీకే శివకుమార్ (DK Shivakumar) సర్వేతోపాటు స్థానిక నాయకత్వాలు కొన్ని సర్వేలు చేయించుకున్నట్లు సమాచారం. వీటిల్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల వాతావరణం ఉన్నట్లు మాత్రమే వెల్లడైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
Telangana Congress MLA Tickets War :ఇప్పటి వరకు పార్టీకి సేవలు చేసినా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth REDDY) , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) దగ్గరగా ఉన్నా.. ఇతర ముఖ్య నాయకులతో దగ్గరగా ఉన్నా టికెట్ల విషయంలో ఇవేమీ పని చేయవన్న సంకేతాలను బలంగా వినిపిస్తున్నాయి. దిల్లీలో ఆదివారం జరిగిన స్క్రీనింగ్ కమిటీ (Congress Screening Committee) సమావేశం.. గతం కంటే భిన్నంగా జరిగింది. మొదట స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో సమావేశమైన చైర్మన్ మురళీధరన్ (Muralidharan).. ఆ తర్వాత ఇద్దరు సభ్యులు, అనంతం ఒక్కొక్కరితో వేర్వేరుగా సమావేశమైనట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల తొలి జాబితా విడుదల మరింత ఆలస్యం కానుంది.