Telangana Congress MLA Candidates List : రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ల కోసం మొదలైన కసరత్తులో మొదటి ఘట్టం పూర్తైంది. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నుంచి వచ్చిన 1006 దరఖాస్తుల వడపోత ప్రక్రియ ముగిసింది. రెండోసారి పీఈసీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆశావహుల వివరాలను సభ్యులకు పీసీసీఅందించింది. 500 పైగా పేజీలతో కూడిన బుక్‌లెట్‌లో దరఖాస్తుదారుల పూర్తి వివరాలు పొందుపరిచారు.
Telangana Congress Screening Committee: ఇందులో ఒకటి, రెండు నుంచి భారీ సంఖ్యలో 36 వరకు అర్జీలు వచ్చిన నియోజకవర్గాల సమాచారం ఉంది. ఆశావహులకు పార్టీతో ఉన్న అనుబంధం, బలోపేతానికి చేసిన కృషి, స్థానిక రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని అర్హులైన అభ్యర్థులను పీఈసీ సభ్యులు ఎంపిక చేశారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను సిఫార్సు చేసి బుక్‌లెట్‌లు బయటికు రాకుండా కవర్లలో సీజ్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, మధుయాస్కీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పొంగులేటి దగ్గరుండి పర్యవేక్షించారు.
Telangana Congress MLA List 2023 :ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తర్వాత స్క్రీనింగ్ కమిటీ(Congress Screening Committee) వడపోత కార్యక్రమం మొదలు కానుంది. ఇందుకోసం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, జిగ్నేశ్ మేవాని, బాబా సిద్ధిఖీ, ఇద్దరు సభ్యులు హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే గాంధీభవన్‌లో మకాం వేసిన 29 మంది పీఈసీ సభ్యులతో 10నుంచి 15 నిమిషాల పాటు విడివిడిగా చర్చించనున్నారు. ఉదాహరణకు మహిళా అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రంలోని పరిస్థితులను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏవైనా విజ్ఞప్తులు ఉంటే సీల్డు కవరులో ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీ అభ్యర్థులకు పెద్దపీట వేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ వివరించారు.
Congress PEC Meeting Postponed : సెప్టెంబర్ 2న జరగాల్సిన కాంగ్రెస్ PEC సమావేశం వాయిదా