తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress MLA Candidates List 2023 : కొలిక్కి వచ్చిన కాంగ్రెస్ మలి విడత అభ్యర్థుల ఎంపిక.. ఇవాళ ఆమోద ముద్ర! - Congress Campaign in Telangana Assembly Elections

Telangana Congress MLA Candidates List 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు హస్తం పార్టీ అభ్యర్ధుల ఎంపిక తుది ఘట్టానికి చేరింది. మెజార్టీ స్థానాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చిన పార్టీ నాయకత్వం.. మలి విడత జాబితాకు ఇవాళ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. మెరిట్‌ ఆధారంగానే ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయగా.. ఇద్దరు పోటీపడుతున్న చోట ఒకర్ని బుజ్జగించి ఇంకొకరిని ఎంపిక చేసినట్లు తెలిసింది. బీసీలకు అధిక సీట్లు కేటాయించేలా ఈ జాబితా ఉండబోతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Telangana Congress
Telangana Congress

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 7:50 AM IST

Telangana Congress MLA Candidates List 2023 తుది ఘట్టానికి మలి విడత అభ్యర్థుల ఎంపిక

Telangana Congress MLA Candidates List 2023 :రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు సమీపిస్తున్నందున.. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. నాలుగైదు స్థానాలు మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రెండ్రోజుల క్రితం ఏఐసీసీ కార్యాలయంలో భేటీ అయిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (Congress Central Election Committee).. స్క్రీనింగ్‌ కమిటీ సిఫార్సులు, అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేసింది.

Congress MLA Candidates List in Telangana 2023 :కొనసాగింపుగా నిన్న మరోసారి భేటీ కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో సమావేశం ఇవాళ్టికి వాయిదా పడింది. రెండో జాబితాపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal).. రెండ్రోజులుగా రాష్ట్ర నాయకులతో, వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతో చర్చించిన తర్వాత తుది అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి జాబితాలో 12 మంది బీసీలకు అవకాశం కల్పించిన కాంగ్రెస్‌.. రెండో జాబితాలో అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Congress Ticket War in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు దక్కించుకునేదెవరు..?

Congress MLA Second List in Telangana 2023 :బీసీల్లో అధిక జనాభా కలిగిన ముదిరాజ్‌, మున్నూరు కాపు, గౌడ్‌, యాదవలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ మరోసారి భేటీ కానున్న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ.. మలి విడత జాబితాకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది. కొన్ని స్థానాలు మినహా మిగిలిన అన్నింటికి అభ్యర్థులను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలోని సీట్లపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy), కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తదితరులతో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది.

ఒకటి రెండు మినహా ఇక్కడ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కువ స్థానాలకు మెరిట్‌ ఆధారంగానే ఎంపిక చేసినట్లు తెలిసింది. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు శుక్రవారం నాటి జాబితాలో ఉండనున్నాయి. ఇల్లెందు, పినపాక, అశ్వరావుపేటలో పొంగులేటి సూచించిన అభ్యర్థుల వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. సత్తుపల్లి, వైరాల్లో ఎవరు పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, భట్టి, పొంగులేటి.. తలో అభ్యర్థిని సూచిస్తుండడంతో ముగ్గురు నేతలూ సమన్వయం చేసుకొని శుక్రవారం తేల్చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్లు తెలిసింది.

Congress Field work stalled to candidates List Late : క్షేత్రంలో కొరవడుతున్న కాంగ్రెస్​.. జానారెడ్డి నేతృత్వంలో బుజ్జగింపుల పర్వం

Telangana Congress MLA Candidates Final List :తాండూరు స్థానానికి ఇటీవలే పార్టీలో చేరిన రంగారెడ్డి డీసీసీబీ ఛైర్మన్‌ మనోహర్‌రెడ్డి పేరు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ టికెట్‌ కోసం పోటీపడిన కేఎల్ఆర్‌కు మహేశ్వరం నుంచి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. వనపర్తికి మేఘారెడ్డి, తాజాగా మళ్లీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరును మునుగోడుకు ఖరారు చేసినట్లు సమాచారం. ఎల్బీనగర్‌లో మధుయాస్కీ (Madhu Yashki Goud) వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. ఎల్లారెడ్డి స్థానానికి మదన్‌ మోహన్‌ రావు పేరు ఖరారు చేసినట్లు చెబుతున్నా.. జాబితా వెలువడితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Congress MLA Ticket Issue in Telangana 2023 :సూర్యాపేట నుంచి పటేల్‌ రమేశ్‌రెడ్డి వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తున్నా... టికెట్‌ ఆశిస్తున్న దామోదర్‌రెడ్డిని నిన్న సాయంత్రం దిల్లీకి పిలిచారు. దామోదర్‌రెడ్డి అంగీకరించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి వైపు మొగ్గు చూపగా, పటాన్‌చెరులో నీలం మధు ముదిరాజ్‌ పేరు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. కొన్ని స్థానాల విషయంలో పీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదించిన పేర్లకు, ఇతర నాయకులు సూచించిన పేర్లకు మధ్య పోటీ ఏర్పడటంతో సర్వేల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పోటీ చేయిస్తే.. ఇక్కడ టికెట్‌ ఆశిస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీలో నిలిపే ఆలోచన అధిష్ఠానం మదిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ డి. సంజయ్‌ పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతి, వ్యతిరేకత ఎదురుకాకుండా, పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అసంతృప్త నాయకుల బుజ్జగింపుపై ముఖ్య నేతలు దృష్టి సారించగా.. కొందరితో ఏఐసీసీ నాయకులే నేరుగా మాట్లాడుతున్నారు.

Khammam Congress MLA Tickets Disputes : ఖమ్మం జిల్లాలో ఆధిపత్యపోరు.. టికెట్ల వేటలో తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్ ముఖ్యులు

నిజామాబాద్‌ అర్బన్, ఖైరతాబాద్‌ టికెట్లు ఆశిస్తున్న మహేశ్‌కుమార్‌ గౌడ్, రోహిణ్‌రెడ్డిలను ముఖ్య నేతలు పిలిచి టికెట్లు ఇవ్వకపోవడానికి కారణాలను వివరించారు. పీసీసీ స్థాయిలో సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అసంతృప్తులను కలిసి బుజ్జగిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌ టికెట్‌ ఆశించిన భూపతిరెడ్డి నర్సారెడ్డి, గోషామహల్‌ టికెట్‌ ఆశించిన ఫిషర్‌మెన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్, మేడ్చల్‌ టికెట్‌ ఆశించిన సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిలతో ఆయన సమావేశమై సముదాయించారు.

Telangana Assembly Elections 2023 :అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకోవటంతో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు.. ఆశావహులు దిల్లీలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. టికెట్ల కేటాయింపుపై వరుస సమావేశాలు, అగ్రనేతల ఆదేశాలతో నాయకులు పరుగులు పెడుతుండగా.. ఆశావహులు పెద్ద సంఖ్యలో దిల్లీలో మకాం వేసి వారి చుట్టూ తిరుగుతున్నారు.

T Congress Party Public Meeting on October 31st : ఈనెల 31న కొల్లాపూర్​లో కాంగ్రెస్​ బహిరంగ సభ.. 28 నుంచి రెండో విడత బస్సుయాత్ర..!

Revanth Reddy Counter Tweet to KTR Tweet : 'రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ చూసి.. కేటీఆర్​కు ఏం చేయాలో అర్థం కావట్లేదు'

ABOUT THE AUTHOR

...view details