Telangana Congress MLA Candidates Issues : నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుండగా కొన్నిస్థానాల అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించినా మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రధానంగా సూర్యాపేట, తుంగతుర్తి , మిర్యాలగూడ, చార్మినార్‌కి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సీపీఎంతో పొత్తుకోసం.. చివర వరకు మిర్యాలగూడను పక్కనపెట్టింది. సీపీఎంతో పొత్తులేకుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మారెడ్డిని బరిలోకి దించనుంది.
Telangana Congress MLA Candidates Selection :చార్మినార్ నుంచి పోటీకి మైనార్టీ నాయకుడు సిద్ధంగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సూర్యాపేట, తుంగతుర్తిలో పట్టున్న దామోదర్‌రెడ్డి, పటేల్‌రమేశ్‌రెడ్డి సూర్యాపేట కోసం పట్టుబడుతుండటంతో ఏకాభిప్రాయం రావట్లేదు. తుంగతుర్తిలో బలమైన నాయకుడు లేకపోవడం.. కొత్తగా చేరిన వారికి సర్వేలు చేసినా బలమైన వ్యక్తి లభించడం లేదు. సూర్యాపేట టికెట్ ఆశిస్తున్న దామోదర్‌రెడ్డి సహకారంతో తుంగతుర్తిలో అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటడటంతో.. పార్టీ తర్జనభర్జన పడుతోంది.
కాంగ్రెస్ బీ ఫామ్ నిలిపివేసిన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట
Telangana Congress MLA Tickets Disputes 2023 : పటాన్‌చెరు అభ్యర్థిగా నీలం మధుకి ప్రకటించినా కోట శ్రీనివాస్‌గౌడ్ అనుచరుల నిరసనతో బీఫారం ఇవ్వకుండా తాత్కాలికంగా నిలుపుదలచేశారు. అక్కడ శ్రీనివాస్ గౌడ్‌కి టికెట్ ఇవ్వాలని దామోదర రాజానర్సింహ డిమాండ్ చేస్తుండగా.. నీలం మధు కోసం జగ్గారెడ్డి పట్టుపడుతున్నారు. నర్సాపూర్ అభ్యర్థి రాజి రెడ్డిని మార్చి టికెట్ ఇవ్వాలని గాలి అనిల్ కుమార్ కోరుతున్నారు. మార్చకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టంచేయడంతో పార్టీ ఎటు తేల్చుకోలేకపోతోంది.