రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణమన్నారు తెలంగాణ కాంగ్రెస్ విధేయుల ఫోరం నేతలు. గాంధీభవన్‌లో ఇవాళ ఫోరం నాయకులు సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం కోసం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారని సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఏఐసీసీ సమావేశం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పజెప్పాలని నేతలు కోరారు. సమావేశంలో సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, కోదండరెడ్డి, శ్యామ్‌మోహన్, కమలాకర్ నిరంజన్, సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
'రాహుల్ గాంధీకి ఏఐసీసీ బాధ్యతలు అప్పజెప్పాలి' - తెలంగాణ కాంగ్రెస్
ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ విధేయుల ఫోరం కోరింది. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ఈ సమయంలో... జాతీయ నాయకత్వం అత్యవసరమని సోనియాగాంధీకి రాసిన లేఖలో వివరించారు.
Telangana Congress Loyalists Forum
Last Updated : Feb 25, 2020, 6:39 PM IST