Telangana Congress Letter To President on Kaleshwaram :కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై (Kaleswaram Lift Irrigation Project) సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (Draupadi Murmu) లేఖ రాసింది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు భద్రత గాలితో దీపంలా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న సమస్యగా పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
Revanth Reddy on Medigadda Barrage : "కేసీఆర్ కుటుంబం ధనదాహానికి.. బలైపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు"
ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున.. ఈ విషయం ఎన్నికల నియమావళి పరిధిలో ఉందని లేఖలో పేర్కొంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పిల్లర్లకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయని, పిల్లర్లు కుంగిన ప్రాంతంలో వంతెన కూడా కుంగిందని తెలిపింది. అందులో ఉన్న నీటిని దిగువకు విడుదల చేశారని వివరించింది. గత నెల 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు రాష్ట్ర పర్యటన చేసిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు.. 20 అంశాలకు చెంది వివరాలు ఇవ్వాలని కోరగా.. కేవలం 11 అంశాలనే అది కూడా అసంపూర్ణంగా ఇచ్చినట్లు ప్రాజెక్టుల పరిరక్షణ అథారిటీ పేర్కొందని తెలియజేసింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది.
Bandi Sanjay Reacts on Medigadda Barrage Incident : 'కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ.. నాణ్యత పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది'
Medigadda Barrage Incident : మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోంది. సరైన భూపరీక్షలు లేకుండానే రూ.వేల కోట్లతో ప్రాజెక్టును నిర్మించారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్‌ల మీదున్న శ్రద్ధ.. ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతలో చూపకపోవడం వల్లే ఈ పరిస్థతి వచ్చిందని ఆరోపించాయి.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జి సహా సీవీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పేర్కొంది. సీఎం వైఖరి వల్ల కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా మారిందన్న భారతీయ జనతా పార్టీ.. వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
అసలేం జరిగిదంటే: ఇటీవలే కొద్దిరోజుల క్రితం కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంత మేరకు కుంగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు తెలుస్తోంది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా.. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది.
'కాళేశ్వరంలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశా, ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల దోపిడీకి పాల్పడింది'
MLC Jeevan Reddy Reacts on Medigadda Issue : 'నాలుగేళ్లకే కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా.. అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి'