Telangana Congress Leaders Strike Against MPs Suspension in Parliament : పార్లమెంటులో దాడి ఘటనపై ప్రకటన చేయాలని కోరితే ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రిభట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ఇందిరా పార్క్ ధర్నచౌక్(Dharna Chouk) వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఇందులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వేములవాడ ఎమ్మెల్యేలు అది శ్రీనివాస్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంత రావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'ఉత్తర కొరియాలా భారత పార్లమెంట్- రాజ్యాంగం సమాధి'- సస్పెన్షన్లపై ఎంపీలు ఫైర్
పార్లమెంటుపై దాడి జరిగితే కేంద్ర హోంమంత్రి, ప్రధాని (Narendra Modi) కానీ ఒక్క ప్రకటన కూడా చేయలేదని భట్టి మండిపడ్డారు. దాడి ఘటనపై ప్రకటన చేయాలని కోరిన వారిని సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యలో ప్రశ్నించే స్పేచ్ఛ కూడా ప్రజా ప్రతినిధులకు లేకపోవడం ఆందోళనకరం అన్నారు. ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడమే ప్రజాస్వామ్యమా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.
'ఉత్తర కొరియాలా భారత పార్లమెంట్- రాజ్యాంగం సమాధి'- సస్పెన్షన్లపై ఎంపీలు ఫైర్
అనేకమంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆయన, అలాంటి స్వాతంత్ర్య దేశంలో ఇప్పుడు అరాచక పాలన సాగుతుందని విరుచుకుపడ్డారు. భారత పార్లమెంట్‌పై జరిగిన దాడిపై హోంమంత్రి నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి, హోంమంత్రి (Amit Shah) ఎటువంటి దాడి జరగనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌పై దాడి (Indian Parliament Attack) అంటే దేశంపై జరిగినట్లే అని అన్నారు. 146 మంది ఎంపీల సస్పెన్షన్ అనేది సిగ్గుచేటని చెప్పారు. దేశ రక్షణను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రజలంతా కాపాడాలని స్పష్టం చేశారు.
'రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం'- ఎంపీల సస్పెన్షన్‌పై ఖర్గే తీవ్ర విమర్శలు
Telangana Ministers on MPs Suspension in Parliament :పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందించారు. మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మతాల పేరుతో బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణరావు వ్యాఖ్యానించారు. పార్లమెంటుపై దాడి జరిగితే కనీసం బీజేపీ స్పందించలేదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వారు ఎంపీలను సస్పెండ్ చేసినట్లు, బీజేపీను ప్రజలు సస్పెండ్ చేస్తారని అన్నారు.
బీజేపీ నియంతృత్వంగా వ్యవహరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar) అన్నారు. పార్లమెంటుకే భద్రత ఇవ్వలేనోళ్లు దేశానికి భద్రత ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారని చెప్పారు. విపక్ష ఎంపీల గొంతు నొక్కుతూ సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
Kunamneni on Suspension of MPs in Parliament :పార్లమెంట్లో దాడి ఏంటని ప్రశ్నించినందుకు, దానిపై విచారణ జరిపించాలని కోరుతున్న ఎంపీలనుసస్పెండ్ చేయడం సరికాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni) వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటే భయంలేకుండా దేశంలో నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ పాలన ఎక్కవ కాలం కొనసాగదని జోస్యం చెప్పారు. దాడిపై అసలు విషయం ఏంటో బయటకు రావాలని కూనంనేని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా బాంబులు వేశారా లేక వారు చేసే తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా వేశారా అని ప్రశ్నించారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని, దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Congress Leaders Strike Against MPs Suspension in Parliament పార్లమెంటు దాడి ఘటనపై విచారణ చేయాలని కోరితే సస్పెండ్ చేస్తారా భట్టి విక్రమార్క 'కేంద్రం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోంది'- సస్పెన్షన్ వేటుపై పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీల నిరసన