తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలంటూ ధర్నా

హైదరాబాద్​ అబిడ్స్​లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట తెలంగాణ కాంగ్రెస్​ కిసాన్​ సెల్​ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

kisan cell dharna
కిసాన్​ సెల్​ నాయకుల ధర్నా

By

Published : Mar 25, 2021, 4:48 PM IST

తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యధావిధిగా కొనసాగించాలని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్​ సెల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అన్నదాతల డిమాండ్లను పరిష్కరించాలంటూ హైదరాబాద్​ అబిడ్స్​లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయాలని కిసాన్ సెల్ నాయకులు కోరారు. రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లపై ఎన్నిసార్లు వినతి పత్రాలిచ్చినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: వయోపరిమితి పెంపుపై నిరసనగా ఓయూ విద్యార్థుల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details