తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress : కాంగ్రెస్​లో తాత్కాలికంగా ఆగిన చేరికలు.. ఆ తర్వాతనే మళ్లీ జోరు

Telangana Congress New Joinings : రాష్ట్రంలో ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్‌లో చేరికల ప్రక్రియ జోరందుకోనుంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా మంచిరోజు కోసం కొందరు వేచిచూస్తుండగా.. మరికొందరు టికెట్‌ గ్యారంటీ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కొల్లాపూర్‌లో 30న జరగనున్న పాలమూరు ప్రజాభేరి సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా దాదాపు 10 మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్‌తో పాటు మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో మరోచోట పోటీచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Leaders Join in Telangana Congress
Leaders Join in Telangana Congress

By

Published : Jul 27, 2023, 1:31 PM IST

కాంగ్రెస్​లో తాత్కాలికంగా ఆగిన చేరికలు.. ఆ తర్వాతనే మళ్లీ జోరు

Congress Party Meeting In Kollapur : రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరికలు తాత్కాలికంగా ఆగాయి. ఈనెల 30న కొల్లాపూర్‌లో జరగనున్నపాలమూరు ప్రజాభేరి సభలో చేరనున్న దాదాపు 10 మంది నాయకులు మినహా కొత్తగా పార్టీతో టచ్‌లో ఉన్న వారంతా ఆగస్టు 15 తరువాతనే చేరతారని పార్టీవర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్​లోకి చేరికలున్నాయంటూ చేస్తున్న ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్టాలనిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతలకు సూచించారు.

Palamuru Praja Bheri in Nagar Kurnool :ఇప్పటికే యాదాద్రి భవనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కారెక్కడంతో మరికొందరు సీనియర్లు అదే బాటలో నడవనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో పెద్దపెద్ద తలకాయల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని పక్కాగా తిప్పికొట్టేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులే ఖండించడంతో పాటు ప్రచారం చేస్తున్న మీడియాపై కఠినంగా ముందుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిస్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు.. స్పందించే తీవ్రత ఆధారంగా వారు పార్టీ వీడతారా.. ఉంటారా..? అన్నది స్పష్టమవుతుందని భావిస్తున్నారు. తద్వారా పార్టీపరంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని పీసీసీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

BRS and BJP leaders Join in Congress :కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు.. సంప్రదింపులు చేస్తున్నా మంచి రోజులు, టికెట్ల కోసం వేచిచూస్తున్నారు. ఆగస్టు 15 తర్వాత.. చేరికల ప్రక్రియఊపందుకోనుందని పార్టీవర్గాలు వెల్లడిస్తున్నాయి. టచ్‌లో ఉన్నవారిలో ఎక్కువమంది టికెట్‌ గ్యారంటీ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

Congress Focus on Telangana Assembly Elections :మహేశ్వరం నుంచి పోటీకి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి సిద్ధంగా ఉండగా దీపాభాస్కర్​రెడ్డి, మేయర్‌ పారిజాతరెడ్డి క్యూలో ఉన్నారు. అదేస్థానం నుంచి కాంగ్రెస్‌తరఫున పోటీకి మాజీ ఎమ్మెల్యే తీగలకృష్ణారెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ టికెట్‌ ఖరారు.. పీసీసీ చేతిలో లేకపోవడం, సర్వేల ఆధారంగా ఇవ్వాల్సి ఉండటంతో గ్యారంటీగా ఇవ్వలేని పరిస్థితి. భువనగిరి నుంచి కుంభం అనిల్‌కుమార్‌ బీఆర్ఎస్​లోకి వెళ్లగా టికెట్‌ ఖరారుచేస్తే కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్​కి చెందిన ముగ్గురు నేతలు సిద్ధంగా ఉన్నారు.

Telangana Congress Joinings After August 15th : అలాగే ఎవరికి టికెట్‌ ఇస్తామని చెప్పలేని పరిస్థితితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు తిరిగి హస్తం పార్టీలోకి వస్తారనికాంగ్రెస్‌ వర్గాలుచెబుతుండగా ఆయన భువనగిరి టికెట్‌కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి.. బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఆయన సతీమణితో కలిసి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుకాంగ్రెస్‌ వర్గాలుచెబుతున్నాయి. కానీ వారంతా టికెట్లకోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

కొడంగల్‌ సహా మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పరిధిలోని ఓ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెండుచోట్ల పోటీకి.. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న ఆయన.. ఎల్బీనగర్‌ లేదా ఉప్పల్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details