రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతిని కలిశారు. విజయశాంతిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల కలిసిన తర్వాత వరుసగా కాంగ్రెస్ నేతలు ఆమెను కలిసి బుజ్జగిస్తున్నారు. కిషన్ రెడ్డి ఆమెను కలిసినట్లు తెలిసిన వెంటనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు కుసుమకుమార్ రంగంలోకి దిగి.. ఆమె ఇంటికి వెళ్లి విజయశాంతితో చర్చించారు. చాలా కాలంగా అసంతృప్తిగా ఉండి.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న విజయశాంతి త్వరలో భాజపాలోకి వెళ్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరగడం వల్ల కాంగ్రెస్ అప్రమత్తమైంది.
విజయశాంతితో భేటీ అయిన మాణికం ఠాగూర్
పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతితో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతిని కలిసిన తర్వాత వరుసగా కాంగ్రెస్ నేతలు ఆమెను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల విజయశాంతిని కలిసి చర్చించిన కుసుమకుమార్.. కాంగ్రెస్ పార్టీని ఆమె వీడరని మీడియాకు వివరణ ఇచ్చారు. కానీ విజయశాంతి వైపు నుంచి ఈ విషయంపై ఎలాంటి స్పందన లేదు. పార్టీలో ఉంటాననికాని.. పార్టీని వీడతాననికాని స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ విజయశాంతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెతో వివిధ అంశాలపై చర్చించిన మాణికం ఠాగూర్.. బయటకొచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వివరించారు. పార్టీ బలోపేతంపై చర్చించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:అర్హులైన బలహీన వర్గాలను 2010లోనే గుర్తించాం: ప్రభుత్వం