Congress General Body Meeting: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్మించాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే ఏఐసీసీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ యాప్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాలు...
Revanth Reddy Comments: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు అడ్డగోలుగా పెరిగాయన్న రేవంత్... రాష్ట్రంలో భాజపా, తెరాస ధాన్యం కొనుగోలు విషయంలో నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మార్చి చివర వరకు గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు, ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొనాల్సిందేనని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండలాల వారీగా, నియోజక వర్గాలు, జిల్లా కేంద్రలలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేట్లు పోరాటాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నాయకులు జిల్లాల్లో తిరిగి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను వివరించాలన్నారు. ముఖ్య నాయకులు గ్రామాల్లో పర్యటించి సమస్య తీవ్రతను బట్టి పోరాటాలను విస్తృతం చేయాలన్నారు.
వరంగల్ సభకు రాహుల్...