Telangana Congress Focus on LokSabha Elections : ఎత్తుకు పైఎత్తులు, తమదైన వ్యూహాలతో రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గద్దె దించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మరో రెండుమూడ్నెళ్లలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నాయకులు, శ్రేణులను సమాయత్తం చేసే దిశలో పార్టీ కార్యకలాపాలు మొదలయ్యాయి.
Congress Focus on Parliament Poll 2024 :అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన స్థానాలు మినహా, మిగిలిన లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అభ్యర్థిత్వం అంశంపై పార్టీ నుంచి ఇప్పటికే హామీ పొందిన పలువురు నేతలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు, పర్యటనలు జరుపుతూ, పార్టీ బలోపేతం దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ కసరత్తు - టికెట్ త్యాగం చేసిన వారికి ఇవ్వాలని నిర్ణయం!
టికెట్ కోసం నేతల ప్రయత్నాలు : శాసనసభ ఎన్నికల్లో టికెట్ లభించని వారితో పాటు, ఓటమి పాలైన పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో, ఆదిలాబాద్ నుంచి 2014లో పోటీ చేసిన నరేశ్‌జాదవ్ మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడిని బరిలోకి దించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ (Balmuri Venkat), మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం పోటీ చేసే అవకాశం ఉంది.
Telangana Congress Lok Sabha Candidates 2024 :నిజామాబాద్ నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటుఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) , పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్, మెదక్ ఎంపీ స్థానం నుంచి విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అలీ మస్కతి పేరు పరిశీలనలో ఉండగా, మల్కాజిగిరి నుంచి హరివర్దన్‌రెడ్డి ఉన్నారు.
పార్లమెంటు దాడి ఘటనపై విచారణ చేయాలని కోరితే సస్పెండ్ చేస్తారా : భట్టి విక్రమార్క