తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Telangana Elections : బీఆర్ఎస్​ను ఎదుర్కొనేలా కాంగ్రెస్ పక్కాప్లాన్.. 'వార్ రూమ్​'గా ఇందిరా భవన్ - బీఆర్​ఎస్​ను ఎదుర్కొనేలా కాంగ్రెస్ వ్యూహాలు

Congress Strategy for Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన పీసీసీ అందుకు సంబంధించి వ్యూహాలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది. గాంధీభవన్‌లోని ఇందిరాభవన్‌ను "వార్‌ రూమ్‌''గా వాడుకునేలా... ప్రణాళికలు సిద్దం చేసింది. ఏపీ పీసీసీ ఉపయోగించుకుంటున్న ఆ భవనాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు.. పీసీసీ స్వాధీనం చేసకొని పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయనుంది. ఈ మేరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజుతో చర్చలు జరుపుతున్న పీసీసీ... ఒకట్రెండు రోజుల్లో ఆ భవనం తమ ఆధీనంలోకి వస్తుందని భావిస్తోంది.

T Congress
T Congress

By

Published : Jul 25, 2023, 9:23 AM IST

బీఆర్ఎస్​ను ధీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ కార్యాచరణ.. 'వార్ రూమ్​'గా ఇందిరా భవన్.!

Congress focus on Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో జోష్‌ పెరుగుతుండడంతో గెలుపు తమదేనన్న ధీమాతో కాంగ్రెస్‌ ముందుకెళ్తోంది. తొలుత రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని భావించినా... ఇటీవలి బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయపరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీకి ప్రజాధరణ క్రమంగా తగ్గుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ద్విముఖ పోటీతోనే... ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అస్త్ర, శస్త్రాలు ప్రయోగిస్తుండగా... వాటిని సమర్ధంగా ఎదుర్కొని ముందుకువెళ్లేలా పీసీసీ ప్రణాళికలు సిద్దంచేస్తోంది. 100 రోజుల ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన పీఏసీ సమావేశం... ఆ దిశలో చర్యలు వేగవంతం చేసే పనిలో ఉంది. ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం సహా నేతల మధ్య ఎలాంటి విభేధాలు లేకుండా ఐకమత్యంగా ముందుకుసాగేలా చర్యలు చేపడుతోంది.

Congress Plans for Assembly Elections : ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వాడుకుంటున్న ఇందిరాభవన్‌ను వార్‌రూమ్‌ కింద ఉపయోగించుకోవాలని పీసీసీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయిలో... ఆ భవనాన్ని అప్పగించాల్సిందిగా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రుద్దరాజును.. పీసీసీ కోరినట్లు తెలుస్తోంది. ఆ భవనాన్ని ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్‌, పీసీసీ సినియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రీతమ్‌, ప్రధాన కార్యదర్శి చరణ్‌ కౌసిక్‌ తదితరులు పరిశీలించారు.

Telangana Assembly Elections 2023 :ఈ సందర్భంగా అక్కడ వార్‌ రూమ్‌ సెటప్‌ ఏలా ఉంటే బాగుంటుందో...పరిశీలన చేశారు. మూడు అంతస్థుల్లోని ఆ భవనాన్ని ఇప్పటికే అప్పుడప్పుడు సమావేశాలు, పెద్ద పెద్ద మీడియా సమావేశాలకు ఇప్పటికే పీసీసీ వినియోగిస్తోంది. ఆ భవనాన్ని ఇస్తే పూర్తిస్థాయిలో.. పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. మొదటి, రెండో అంతస్థులో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ స్థానాలకు ప్రత్యేకంగా డెస్క్‌టాప్‌లు ఏర్పాటు సహా మిగిలిన 88 అసెంబ్లీ, 12 పార్లమెంటు నియోజకవర్గాల పర్యవేక్షణకు అవసరమైన ఏర్పాట్లుచేయనున్నారు. మూడో అంతస్థులో ఎన్నికలకు సంబంధించి కొత్తగా నియమించుకునే వారికి కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు నేతృత్వంలో శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఒకే సారి 200 నుంచి 300 వందల మందికి శిక్షణ ఇచ్చేలా అనువుగా మౌలిక వసతులు ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ వార్​రూమ్ ద్వారానే ఎన్నికల పర్యవేక్షణ : రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 17 మంది సమన్వయకర్తలు... 119 అసెంబ్లీ స్థానాలకు 119 మంది ప్రధాన కార్యదర్శులను సమన్వయకర్తలుగా నియమించనున్నారు. ప్రతి 10 బూతులకు.. ఒక పెసిలిటేటర్‌, ప్రతిబూతుకు ఒక బూత్‌స్థాయి ఏజంట్‌ నియమించాలని పీసీసీ నిర్ణయించింది. ఈ వార్‌రూమ్‌ ద్వారానే రాష్ట్రంలోని ఎన్నికలుపర్యవేక్షించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆ భవనాన్ని పలిశీలించిన పార్టీ నేతలు వీలైనంత త్వరగా స్వాధీనంచేసుకొని మౌలికవసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వార్‌రూమ్‌ పర్యవేక్షణకు సీనియర్‌ నేతమల్లు రవితోపాటు... మరికొందరిని నియమించనున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details