తెలంగాణ

telangana

ETV Bharat / state

'చిన్నారెడ్డిలో చిన్న మచ్చ కూడా లేదు.. గెలిపించండి' - గాంధీభవన్​లో కాంగ్రెస్ సమావేశం

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ మండలి పట్టభద్రుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, అభ్యర్థి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.

'చిన్నారెడ్డిలో చిన్న మచ్చ కూడా లేదు.. గెలిపించండి'
'చిన్నారెడ్డిలో చిన్న మచ్చ కూడా లేదు.. గెలిపించండి'

By

Published : Feb 22, 2021, 9:32 PM IST

ఈనెల 24 నుంచి మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ మండలి పట్టభద్రుల సన్నాహక సమావేశం జరిగింది.

ఉద్యోగాలు ఇవ్వకపోగా... ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని రేవంత్​ ఆరోపించారు. భాజపాతో ఒప్పందంలో భాగంగానే కేసీఆర్‌... పీవీ వాణీని పోటీకి దించారన్నారు. కాంగ్రెస్‌ ఓట్లను చీల్చి భాజపాకు లాభం చేకూర్చడమే కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. చిన్నారెడ్డిలో వెతకడానికి చిన్న మచ్చకూడా లేదని... ఆయనను గెలిపించాలని కోరారు.

ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్, మాజీ ఎంపీలు మల్లు రవి, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌, డీసీసీలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి

ABOUT THE AUTHOR

...view details