Telangana Congress Candidates B Forms :హైదరాబాద్ గాంధీభవన్‌లో సందడి వాతావరణం నెలకొంది.కాంగ్రెస్ అభ్యర్థులకు ఆ పార్టీ బీ ఫామ్‌లు అందజేసింది. మొదటి బీ ఫామ్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందుకున్నట్లు తెలుస్తోంది. గాంధీభవన్ సిబ్బంది ఆయనకు బీ ఫామ్ అందజేసినట్లు సమాచారం. దానిని రేవంత్‌రెడ్డి అనుచరులు వచ్చి తీసుకెళ్లారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థి బోయ నగేశ్, సిర్పూర్ కాగజ్ నగర్ రావి శ్రీనివాస్‌కు బీ ఫామ్ అందజేశారు. అలాగే నిర్మల్ నియోజకవర్గం నుంచి శ్రీహరిరావు తరఫున ఆయన కూతురు, జగిత్యాల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి కుమారుడు, రామగుండం అభ్యర్థి మకన్ సింగ్ ఠాకూర్ కుమారుడు బీ ఫామ్‌లు అందుకున్నారు.
Telangana Congress Candidates B Forms Distribution :ఇవాళ మొదటి రోజు ఇప్పటి వరకు 60 మంది వరకు బీ ఫామ్‌లను తీసుకెళ్లినట్లు పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. కొందరు అభ్యర్థులే గాంధీభవన్‌కి వచ్చి బీ ఫామ్‌లు తీసుకెళ్లగా.. మరికొందరు వారి అనుచరులను పంపించి తెప్పించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లు ఎవరు కూడా బీ ఫామ్‌లు తీసుకెళ్లలేదు. వారంతా మంచి రోజు కోసం వేచి చూస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు నష్ట నివారణ చర్యల కోసం రంగంలోకి సీనియర్లు
Congress B Forms Distribution in Telangana : ఇప్పటి వరకు విడుదల చేసిన వంద నియోజకవర్గాల అభ్యర్థుల్లో 60 మందికి బీ ఫామ్‌లు ఇవ్వగా.. మరో 37 మంది అభ్యర్థులు తీసుకోవాల్సి ఉందని వెల్లడించాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఈనెల 6న కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా తెలంగాణలో పర్యటించనున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 10వ తేదీన కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.
B Forms for Telangana Congress Candidates :కాంగ్రెస్ ఇప్పటి వరకు మొదటి, రెండో విడత జాబితాలను విడుదల చేయగా.. దాదాపు వంద మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందుకుగాను వంద మంది అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్(Telangana Election Notification) విడుదల కావడం, నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసే గడువు ఉంది. ఈ నేపథ్యంలో నామినేషన్లతో పాటు బీ ఫామ్‌లు ముఖ్యం.. బీ ఫామ్ ఉన్న వారిని మాత్రమే అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు బీ ఫామ్ కోసం నేతలను పిలుస్తున్నారు. కాంగ్రెస్ మూడో జాబితాపై హైకమాండ్ కసరత్తు ఇంకా జరుగుతోంది. ఇవాళ లేదా రేపు జాబితా విడుదలయ్యే అవకాశముందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్‌ల అందజేత పొత్తు తేలకపాయె జాబితా రాకపాయె - కాంగ్రెస్‌లో మూడో జాబితా వచ్చేదెన్నడో?
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్