Telangana Congress Campaign on Kaleshwaram Project Damage : కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వినూత్నమైన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ పార్టీ పది ఏళ్లలో అవినీతికి పాల్పడిందంటూ ప్రచారంలో హోరెత్తిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని.. ప్రచారంలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక కాళేశ్వరం ఏటీఏం(Kaleshwaram ATM)ను ఆవిష్కరించింది. దీన్ని ఉపయోగించుకుని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు.
Kaleshwaram Project ATMs in Hyderabad: కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేస్తూ.. ఎన్నికల్లో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపేరుతో దోచుకున్నారని.. ఆ ప్రాజెక్ట్ కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కాళేశ్వరం పేరిట ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎంపై కాళేశ్వరం కరప్షన్ రావు(కేసీఆర్) అని రాసి.. కేసీఆర్ ఫొటో(KCR Photo on Kaleshwaram ATM)ను అమర్చారు. ఏటీఎం నుంచి రూ.లక్ష కోట్ల నోటు.. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ అంటూ ఏటీఎంపై కాంగ్రెస్ పార్టీ రాసింది.
Revanth Reddy Speech at Kollapur Public Meeting : 'తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కి ఒక్క అవకాశం ఇవ్వండి'
Congress Innovative Campaign in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ జాతీయ నాయకులు పర్యటనచేసి.. కేసీఆర్ అవినీతి పాలనపై పలు విమర్శలు చేశారు. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను ఉపయోగించుకుని కేసీఆర్ కుటుంబం నిధులు దోచేసి.. అవినీతికి పాల్పడ్డారని పలు విమర్శలు చేశారు. ఈ బ్యారేజ్ కుంగిపోవడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రాజెక్ట్ నిర్మించి కేవలం నాలుగు సంవత్సారాలకే కుంగిపోవడం ఏమిటని కేసీఆర్‌పై మండిపడ్డారు. దీంతో పాటు కేసీఆర్ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్ర నాయకులు విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో అని ప్రజలకు వివరిస్తున్నారు.