తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress Bus Yatra Schedule 2023 : ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర - Telangana Congress Bus Yatra Schedule 2023

Telangana Congress Bus Yatra Schedule 2023 : కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు బస్సు యాత్ర చేపట్టనుంది. ఈ యాత్ర అక్టోబరు 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు పాల్గొంటారని తెలిపాయి.

Telangana Congress Bus Yatra
Telangana Congress Bus Yatra Schedule 2023

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 2:07 PM IST

Updated : Oct 9, 2023, 2:53 PM IST

Telangana Congress Bus Yatra Schedule 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల ఎంపికపై ఓవైపు కసరత్తు చేస్తూనే.. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ప్రచార వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బస్సు యాత్ర షెడ్యూల్​ను కాంగ్రెస్ పార్టీ వర్గాలు విడుదల చేశాయి. ఈ యాత్రలో ఏఐసీసీ నేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నట్లు తెలిపాయి. ఈ బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను (Six Guarantees of Congress) ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Telangana Congress Bus Yatra Dates 2023 :ఈ నెల 15వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వారం.. పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగునుందని నేతలు వెల్లడించారు. ఒక్క రోజులో ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు రూట్ మ్యాప్​నుకాంగ్రెస్ అధిష్ఠానంసిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మంగళవారం రోజున రూట్‌ మ్యాప్‌తోపాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. అలంపూర్ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆరు రోజులు కాంగ్రెస్ నాయలు బస్సు యాత్రలో పాల్గొంటారు.

CWC Meeting Today : 'ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పక్కా వ్యూహం అవసరం.. క్రమశిక్షణతో పనిచేయాలి'

Telangana Congress Election Campaign 2023: బస్సు యాత్ర ప్రారంభం రోజున 15, 16వ తేదీల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) .. 18, 19వ తేదీలల్లో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), 20, 21వ తేదీలల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇందు కోసం మూడు రకాల రూట్‌ మ్యాప్‌లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు అంశాలపై మంగళవారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Telangana Congress MLA Tickets War : దిల్లీకి చేరిన కాంగ్రెస్‌ టికెట్ల వార్‌.. ప్లకార్డులు పట్టుకొని నిరసనలు

బస్సుయాత్రకు సంబంధించి వివరాలు బయటకు రాకుండా పీసీసీ జాగ్రత్త పడుతోంది. పీఏసీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు బయటకు బహిర్గమైతే.. ఇబ్బంది ఉంటుందని భావించిన పీసీసీ గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. రేపు పీఏసీ సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బస్సుయాత్రలోఏయే ప్రాంతాల్లో కార్నర్ సమావేశాలు నిర్వహించాలి.. జనసమీకరణ ఉండాలా.. వద్దా.. ఏయే అంశాలను ప్రచారం చేయాలి అన్న అంశాలపై రేపు చర్చించనున్నట్లు సమాచారం. సమావేశాలు నిర్వహించడానికి.. నియోజకవర్గాలపై పూర్తి స్థాయి పట్టుండే ప్రదేశాలను ఎంచుకోవడానికి ఆయా జిల్లాల అధ్యక్షులకు ఈ బాధ్యతలను అప్పగించారు. కేంద్ర.. రాష్ట్ర వైఫల్యాలను ప్రజలకు ఏ విధంగా చేరవేయాలి.. వారిపై ఏ విధంగా విమర్శలు ఉండాలి అన్న వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు ఉండేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు.

Telangana Congress MLA Candidates List Delay : కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

Telangana Congress Screening Committee Meeting : కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు.. అధిష్ఠానానికి అందజేసిన స్క్రీనింగ్ కమిటీ

Last Updated : Oct 9, 2023, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details