Telangana Congress Bus Yatra 2023 :ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ప్రకటనతో సంబంధం లేకుండా ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర(Congress Bus Yatra)ను చేపట్టాలని నిర్ణయించింది. ఈనెల 14,15 తేదీల్లో బస్సు యాత్ర మొదలు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ బస్సు యాత్ర ద్వారా ఇప్పటివరకు ప్రకటించిన యువ డిక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, చేయూత పెన్షన్ పథకం, ఆరు హామీల గ్యారంటీ కార్డు(Congress Six Guarantees Scheme)లను జనాల్లోని తీసుకెళ్లనున్నారు. రోజుకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేసేటట్లు రూట్ మ్యాప్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధం చేస్తుంది.
Rahul Gandhi Bus Yatra in Telangana :దాదాపు 119 అసెంబ్లీ నియోజకవర్గాల(Telangana Assembly Election 2023)ను చుట్టి వచ్చేటట్లు ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు. ప్రతిచోట కార్నర్ సమావేశాలు నిర్వహణకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతోంది. నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో పట్టుండే ప్రదేశాలను ఎంపిక చేసే బాధ్యతలను ఆయా జిల్లా అధ్యక్షులకు ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. ఓటర్లను ఆకర్షించే విధంగా నాయకుల ప్రసంగాలు ఉండేటట్లు జాగ్రత్త వహిస్తున్నారు.
Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్, షెడ్యూల్
Priyanka Gandhi Bus Yatra in Telangana 2023 :ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఈనెల 14,15 తేదీలతో ప్రియాంక గాంధీ బస్సు యాత్రను రాష్ట్రానికి వచ్చి ప్రారంభించనున్నారు. రెండు, మూడు రోజుల రాష్ట్రంలో ఆమె పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.