Telangana Congress Bus Yatra 2023 :రాష్ట్రంలో వచ్చే నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటికే దాదాపు 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మరో వారంలోపే తొలి జాబితా ప్రకటించేందుకు (Congress MLA Candidates First List) సిద్ధమయ్యారు. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Candidates List Delay :పలు నియోజకవర్గాలలో నిర్వహించిన సర్వేల్లో అగ్రస్థానంలో నిలిచిన నాయకుల పేర్లను జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్న వివాద రహిత నియోజకవర్గాలు దాదాపు 63 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, సనత్‌నగర్ నుంచి కోట నీలిమ, సికింద్రాబాద్ నుంచి సంతోశ్, ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మహేశ్వరం నుంచి పారిజాత నరసింహారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Telangana Congress Bus Yatra Schedule 2023 : ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర
Telangana Congress MLA Tickets Issue :జూబ్లీహిల్స్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, అజారుద్దీన్ రేసులో ఉండడం వల్ల.. ఇద్దరి పేర్లు పరిశీలనకు పెట్టినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌లో డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేటర్ విజయ రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి మల్‌రెడ్డి రాంరెడ్డి, మధుయాస్కీల పేర్లు పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. మిర్యాలగూడ, మునుగోడు, సూర్యాపేట, జనగాం, వరంగల్ ఈస్ట్ వంటి నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికతలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
Congress MLA Candidates List Telangana 2023 :కాంగ్రెస్ అభ్యర్థులను ఏఐసీసీ ఇంకా ప్రకటించలేదని మీడియాలో వచ్చే పేర్లను నమ్మి ఎవరూ ఆందోళన చెందవద్దని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో కోరారు. మరోవైపు తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదంతో.. విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు హస్తం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇవాళ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో విధివిధానాలపై చర్చ జరుగుతుంది.