Telangana Congress BC Declaration 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్.. పలు డిక్లరేషన్‌ల పేరుతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే యువ, రైతు, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించగా.. గురువారం మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించింది. తాజాగా నేడు బీసీ డిక్లరేషన్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్ ప్లాన్ మాదిరిగా మహాత్మా జ్యోతిరావు పూలే సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్న ఆయన.. మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా బీసీలకు అనేక అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం : సిద్ధరామయ్య
బీసీ డిక్లరేషన్‌లోని ముఖ్యంశాలు..:
A. రిజర్వేషన్లు
- కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు.
- కొత్తస్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కు పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో(Municipalities) కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ.
- పభ్రుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్.
B. నిధులు
- బీసీ సబ్ ప్లాన్‌కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు.
- బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు.
C. సంక్షేమం
- ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ.
- అన్ని బీసీకులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు. బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు.
- అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీసర్కిల్, లైబర్రీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు. బీసీ ఐక్యత భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు.