తెలంగాణ

telangana

ETV Bharat / state

All Party Meeting Demands: అఖిలపక్షం భేటీ డిమాండ్స్, నివారణ చర్యలు ఇవే... - బచావో హైదరాబాద్‌

All Party Meeting Demands: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బచావో హైదరాబాద్‌ అంటూ అఖిలపక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అఖిలపక్ష భేటీలో చర్చించారు. అయితే అఖిలపక్షం డిమాండ్లు, నివారణ చర్యలపై ప్రకటన విడుదల చేశారు.

All Party Meeting Demands
All Party Meeting Demands

By

Published : Jun 15, 2022, 4:28 PM IST

అఖిలపక్షం భేటీలో నిర్ణయించిన విషయాలు ఇవే...

  1. మైనర్లు, మహిళలపై జరిగే అత్యాచారాలతో పాటు.. అన్ని రకాల అఘాయిత్యాలకు సంబంధించి కేసు నమోదైన 3 వారాల్లోగా పరిష్కరించాలి. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి.. సత్వార న్యాయం చర్యలు తీసుకోవాలి.
  2. జూబ్లీహిల్స్ బాధితురాలికి రక్షణ కల్పించాలి. ఈ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలి.
  3. నిందితుల నేపథ్యంతో సంబంధం లేకుండా.. కేసు నమోదు చేసి.. తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేసు విచారణలో వీవీఐపీలు/పెద్దల జోక్యాన్ని పూర్తిగా నివారించాలి.
  4. ప్రతి మండలంలో ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలి. పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలి. ప్రస్తుతం పోలీస్ శాఖలో 5.1 శాతం మంది మాత్రమే మహిళా సిబ్బంది పని చేస్తున్నారు.
  5. ప్రతి జిల్లాలో నేరం జరిగినప్పుడు అత్యవసరంగా స్పందించడానికి, ఫిర్యాదులను స్వీకరించడానికి వీలుగా 3 అంకెలతో కూడిన హెల్ప్‌లైన్లను కలిగి ఉండే కంట్రోల్ రూమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
  6. గతంలో లైంగిక దాడులకు పాల్పడిన నిందితుల వివరాలతో కూడిన డేటాను డిజిటలైజ్ చేయాలి. లైంగిక దాడులు తిరిగి పునరావృతం కాకుండా వారిపై నిరంతరం నిఘా ఉంచాలి.
  7. విద్యుత్, వెలుతురు లేకుండా చీకటిగా ఉండే పబ్లిక్/బహిరంగ ప్రదేశాలను గుర్తించాలి. వాటికి విద్యుత్ సౌకర్యం కల్పించే చర్యలు తీసుకోవాలి.
  8. తరుచు నేరాలు జరిగే ప్రదేశాలు, ప్రజలు అభద్రతగా భావించే ప్రదేశాల వివరాలతో కూడిన మ్యాప్‌ను రూపొందించాలి. అటువంటి ప్రదేశాల్లో పోలీసుల నిఘా, పెట్రోలింగ్ పెంచాలి. తద్వారా ఆ ప్రదేశాలు కూడా సురక్షితమనే భావన మహిళల్లో కలిగించాలి. అంతేకాకుండా సదరు ప్రదేశాల్లో ఎవరైనా ప్రమాదంలో ఉంటే 5 నిమిషాల్లో ఎస్‌ఓఎస్‌ మెసేజ్ సంబంధిత అధికారులకు చేరే విధంగా వ్యవస్థను రూపొందించుకోవాలి.
  9. మహిళలు కాలకృత్యాల కోసం బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లకుండా ప్రతి 4 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వం మరుగుదొడ్లను నిర్మించాలి.
  10. డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాలి. నిరంతం నిఘా, పర్యవేక్షణ ద్వారా డ్రగ్స్ నెట్ వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాలి. బెల్టు షాపులను నిషేధించాలి. పబ్బులు, హుక్కా పార్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి వీలుగా కఠినమైన ఎక్సైజ్ పాలసీని తీసుకురావాలి.
  11. మహిళల అవసరాలకు అనుగుణంగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపాలి. మహిళలు బస్సులు, మెట్రో వంటి రవాణా వ్యవస్థలను వినియోగించుకునేలా వాటి సర్వీసులను పెంచాలి.
  12. ఆర్టీసీ, మెట్రోల్లో ప్రయాణించే మహిళలకు రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలి.
  13. మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చి వారికి కమర్షియల్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలి. వారిని ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్లుగా, వాహానాలను నియంత్రించే ప్లీట్ ఆపరేటర్లుగా అంటే కంట్రోలర్లుగా నియమించే విధంగా చర్యలు తీసుకోవాలి.
  14. క్యాబ్‌ల మాదిరిగా మహిళల నియంత్రణలో, నిర్వహణలో, మహిళలు డ్రైవర్లుగా ఉండే ఒక యాప్‌ను రూపొందించాలి. మహిళల సురక్షిత ప్రయాణానికి సంబంధించిన అన్ని అవసరాలు తీర్చే మాధ్యమంగా ఆ యాప్ పని చేయాలి.
  15. తెలంగాణలోని అన్ని పాఠశాలలు, కాలేజీల్లో చదివే బాలికలకు, కార్యాలయాల్లో పని చేసే మహిళలకు ఆత్మ రక్షణలో ఉపకరించే కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాలి.
  16. బాలికలకు 1వ తరగతి నుంచే బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌, కొత్త వారు, అపరిచితులతో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంలో అవగాహన కల్పించాలి.
  17. పోర్న్ సైట్స్‌పై నిషేధం విధించాలి.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసిన అవగాహన కార్యక్రమలు...

  1. తెలంగాణలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో లింగ సమానత్వం, మహిళలు, బాలికల రక్షణకు రూపొందించిన చట్టాలు, వాటిని అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలపై వర్క్ షాప్‌లు నిర్వహించాలి.
  2. 1 నుంచి 12 తరగతుల సిలబస్‌లో లింగ సమానత్వానికి సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చాలి.
  3. 6 నుంచి 12 తరగతుల సిలబస్‌లో నిర్భయ యాక్ట్, పోక్సో చట్టం, లైంగిక సంబంధిత నేరాల్లో విచారించే తీరు, విధించే శిక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చాలి.
  4. డ్రగ్స్, మద్యం, పబ్‌లతో చోటు చేసుకునే దుష్పప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి.
  5. మహిళల భద్రత, లింగ సమానత్వానికి సంబంధించి ఉన్న చట్టాలు, నిబంధనల గురించి విస్తృతం ప్రచారం జరిగేలా యువతను సముహాలుగా విభజించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
  6. తల్లిదండ్రులు మైనర్ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  7. విమెన్ ట్రాఫికింగ్ సమస్యపై ఉక్కుపాదం మోపాలి.
  8. మహిళా మంత్రుల సంఖ్య పెంచాలి.
  9. ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించి మహిళలకు భరోసా కల్పించాలి.

ప్రకటించే కార్యక్రమాలు...

  1. నిస్సహాయ స్థితిలో లేదా.. ఎవరూ లేకుండా ఒంటరిగా అసురక్షితమైన ప్రదేశంలో ఉన్న మహిళను భద్రంగా ఇంటికి లేదా గమ్యానికి చేర్చే బాధ్యతను ఎన్‌ఎస్‌ఐయూ, యూత్ కాంగ్రెస్ వాలంటర్లు తీసుకోవాలి. సదరు మహిళకు అవసరమైన రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి. కఠిన పరీక్ష తర్వాతే ఇటువంటి వాలంటీర్లను ఎంపీక చేయాలి.
  2. మహిళలైప అఘాయిత్యాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా యూత్ కాంగ్రెస్ నిరంతరం ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలి.

ఇదీ చూడండి: Gouravellli reservoir: గౌరవెల్లి పరిహారం చెల్లింపునకు ఎందుకింత ఆలస్యం..?

ABOUT THE AUTHOR

...view details