Cm Kcr on BJP: ధాన్యం కొనుగోళ్ల అంశంతో మొదలైన తెరాస, భాజపా మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పటికే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. రైతులు, అన్ని వర్గాల వారు బాగుపడాలంటే కమలం పార్టీని గద్దెదించాల్సిందేనని పిలుపునిచ్చారు. మోదీ సర్కార్ వైఖరికి నిరసనగా దీక్ష కూడా చేశారు. రాజకీయంగా మరో అడుగు ముందుకేసిన సీఎం... భాజపా ముక్త్ భారత్ పేరిట సంప్రదింపులకు శ్రీకారం చుట్టారు.
భాజపా ముక్త్ భారత్...
భాజపా వ్యతిరేక పార్టీలతో తెరాస అధినేత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలతో సమావేశమైన కేసీఆర్... భాజపా ముక్త్ భారత్ అంశంపైనే ప్రధానంగా చర్చించారు. లౌకిక, ప్రజాస్వామిక వాదం లక్ష్యంగా భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి కార్యాచరణ రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. రెండ్రోజుల క్రితం ఆర్జేడీ ముఖ్యనేత, బిహార్ ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. భాజపా వ్యతిరేక పోరాటంలో భాగంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్‌ను తేజస్వి యాదవ్‌తో పాటు ఆయన తండ్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. ఆర్జేడీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
సీఎం గైర్హాజరు...