తెలంగాణ

telangana

ఆంధ్రా ఆదర్శ రైతుకు సీఎం కేసీఆర్​ ఫోన్​...

By

Published : Dec 20, 2020, 5:10 AM IST

Updated : Dec 20, 2020, 6:11 AM IST

ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఆదర్శ రైతుకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. త్వరలోనే కారు పంపిస్తానని... తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు పరిశీలించాలని కోరారు. ఒకపూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ఆ రైతును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు.

ఆంధ్రా ఆదర్శ రైతుకు సీఎం కేసీఆర్​ ఫోన్​...
ఆంధ్రా ఆదర్శ రైతుకు సీఎం కేసీఆర్​ ఫోన్​...

ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఆదర్శ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. "నేను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ను మాట్లాడుతున్నా".. అన్న మాట వినగానే... ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. ఏపీలోని కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావుకు శనివారం ఉదయం 9.30 గంటలకు సీఎం కేసీఆర్... ఫోన్​ చేసి మాట్లాడారు.

సీడ్రిల్ ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై.. రైతు ప్రసాదరావును కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాను 35 ఎకరాల్లో సీడ్రిల్​ను ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేశానని... 40-45 బస్తాలు దిగుబడి సాధించానని ప్రసాదరావు సవివరంగా తెలిపారు. త్వరలో కారు పంపిస్తానని... తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు పరిశీలించాలని ముఖ్యమంత్రి ప్రసాదరావును కోరారు. ఒకపూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ఆహ్వానించారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చిన విషయం తెలిసి... ప్రసాదరావును స్థానిక రైతులు అభినందించారు. రైతులు, వ్యవసాయం పట్ల కేసీఆర్​కు ఉన్న మక్కువను కొనియాడారు.

ఇదీ చదవండీ: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నేడు కేసీఆర్​ సమీక్ష

Last Updated : Dec 20, 2020, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details