తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Flex in Mumbai : ముంబయిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీల జోరు.. ఫొటోలు వైరల్ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

CM KCR Flex in Mumbai: తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు ముంబయిలో పెద్దసంఖ్యలో వెలిశాయి. కేసీఆర్ అభిమానులు... నగరంలోని పలు కాలనీల్లో వీటిని ఏర్పాటు చేశారు. కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌... మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఇవాళ భేటీ కానున్నారు.

CM KCR Flex in Mumbai, kcr flex photos
ముంబయిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీల జోరు

By

Published : Feb 20, 2022, 12:47 PM IST

CM KCR Flex in Mumbai: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి పర్యటన నేపథ్యంలో... ముంబయిలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్‌ అభిమానులు.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. కాగా అందుకు సంబంధించిన ఫొటోలు... సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్​గా మారాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌తో కేసీఆర్‌ ఇవాళ వేర్వేరుగా... భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై... చర్చించనున్నారు. రాత్రి 7.20 నిమిషాలకు... ముంబయి నుంచి హైదరాబాద్‌కు కేసీఆర్‌ తిరుగు ప్రయాణం కానున్నారు.

ముంబయిలో కేసీఆర్ ఫ్లెక్సీలు.. వైరల్

కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్ నుంచి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరిన కేసీఆర్‌... మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం వర్షలో ఉద్ధవ్‌తో సమావేశమవుతారు.

పలు ప్రాంతాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో సమావేశం కోసం... కేసీఆర్ ముంబయి వెళ్తున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట.. ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు జె.సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన నేపథ్యంలో... అక్కడ భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు కలిసి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:CM KCR Mumbai Tour: ముంబయికి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details