తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, తక్షణ చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కొవిడ్-19 వైరస్ నివారణకై తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించామని వెల్లడించారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని సీఎం తెలిపారు. గాంధీలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని... వారి నమూనాలు పుణె పరీక్ష కేంద్రానికి పంపించామని వివరించారు. కొన్ని రోజులపాటు రాష్ట్రంలో బహిరంగ సమావేశాలు నిర్వహించవద్దని కోరారు. విందులు, వేడుకలు ఇంటికే పరిమితం చేసుకోవాలని సీఎం సూచించారు.
ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది: కేసీఆర్
ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని... వారి నమూనాలు పుణె పరీక్ష కేంద్రానికి పంపించామని వివరించారు. ప్రతి వందేళ్లకోసారి కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని అన్నారు. వందేళ్ల క్రితం ఈ మహమ్మారి బారిన పడి కోటీ 4 లక్షల మంది మరణించారని తెలిపారు.
'వందేళ్లకోసారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది'
" దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్లో కరోనా వైరస్ వ్యాపించకుండా అప్రమత్తంగా ఉన్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో 200 మంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి, విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్-19 వల్ల ప్రమాదం లేకున్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది."
- సీఎం కేసీఆర్
- ఇదీ చూడండి :'రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం'
Last Updated : Mar 14, 2020, 4:44 PM IST