తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు.. జననేతకు ప్రముఖుల విషెస్‌

CM KCR birthday celebrations: బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన్ని పార్టీ శ్రేణులు, అభిమానులు, సాధారణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. జననేతకు అభిమానంతో వినూత్న రీతుల్లో శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడోత్సవాలు, రక్తదాన శిబిరాల ఏర్పాటుతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అభిమాన నేత ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.

CM KCR birthday celebrations
CM KCR birthday celebrations

By

Published : Feb 17, 2023, 8:34 PM IST

Updated : Feb 17, 2023, 8:44 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు.. జననేతకు ప్రముఖులు విషెస్‌

CM KCR birthday celebrations: ముఖ్యమంత్రి కేసీఆర్ 69 జన్మదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, తమిళనాడు, అసోం సీఎంలు స్టాలిన్, హిమంత బిశ్వశర్మలు భగవంతుడు కేసీఆర్‌కు ఆరోగ్యవంత జీవితం ఇవ్వాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ముందుకుసాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కసీఆర్‌ జన్మదినాన్ని అభిమానులు, పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కేక్ కేట్ చేసి.. అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ మేడ్చల్ జిల్లా కీసరలో మొక్కలు నాటారు. అంతకుముందు కీసర గుట్టలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బల్కంపేట్‌లోని ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేటలో పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేసిన మంత్రి హరీశ్ రావు.. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో చిన్నారులతో కలిసి మంత్రి సత్యవతి కేకు కోశారు.

ఇండోర్ స్టేడియంలో మంత్రి సత్యవతి వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. నల్గొండలో విద్యుత్‌ శాఖ మంత్రి ఆధ్వర్యంలో మెగా రక్తదానశిబిరాన్ని నిర్వహించారు. అంతకుముందు లోకకల్యాణార్థం మహాచండీయాగం నిర్వహించారు. వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం ఊరంచుతండా సమీపంలో సాగునీటి కాలువపై ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోశారు. నిరుపేదల ఇళ్లలో రోజూ కేసీఆర్ జన్మదినం జరుపుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.

KCR Birthday Celebrations in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోనూ బీఆర్‌ఎస్‌ అధినేత జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మొక్కల పంపిణీ చేపట్టారు. గుంటూరులో నిర్వహించిన వేడుకల్లో పార్టీ నాయకుడు రావెల కిషోర్ బాబుతో పాటు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘాల నేతలు పాల్గొని కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

కూకట్‌పల్లి రామాలయంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించి.. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి ఆధ్వర్యంలో భారీ కేక్‌ కోసం అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ విద్యుత్ సౌధలో ట్రాన్స్ కో, జెన్‌కో ఆధ్వర్యంలో మెగారక్తదాన శిబిరాన్ని సీఎండీ ప్రభాకర్ రావు ప్రారంభించారు. జిల్లాల్లోనూ శాసనసభ్యులు తమతమ నియోజవకవర్గాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా పార్టీ అధినేత కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ నేత రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో వృద్ధులకు, మహిళలకు నూతన వస్త్రాలతో పాటు 116 రూపాయల కానుక అందజేశారు. వనపర్తి జిల్లాలో రైతులు తాము పండించిన పంటలతో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డులో కేసీఆర్ భారీ చిత్రపటాన్ని రూపొందించి అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఉలువలు, వేరుశనగ, ఉప్పుతో 25 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు విస్తీర్ణం గల చిత్రపటం వేశారు.

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌లో వీరాభిమాని వెంకటేశ్‌ కేసీఆర్‌ ప్రతిమను తయారుచేయించారు. కుటుంబసభ్యులతో కలిసి పాలాభిషేకం చేసి, కేక్ కోసి పంపిణీ చేశారు. భారాస నాయకుడు అరవింద్ అలిశెట్టి సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్‌పై పారాగ్లయిడర్లపై "హ్యాపీ బర్త్​డే సీఎం కేసీఆర్ సార్.. అబ్ కి బార్ కిసాన్ సర్కార్" నినాదాలతో శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చదవండి:

సీఎం కేసీఆర్​కు BRS నేత అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా గాల్లోనే..

సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ.. కారణజన్ముడంటూ ప్రశంసలు

'అందరూ ఒకే అబద్ధం చెప్పేలా మీ మంత్రులను ట్రైన్ చేయండి.. మోదీ జీ'

Last Updated : Feb 17, 2023, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details