ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గొల్లపూడి పరిశోధనాత్మక రచనలు, నాటకాలు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని ప్రశంసించారు.
గొల్లపూడి నాటకాలు.. భాషాభివృద్ధికి మార్గదర్శకం - గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. గొల్లపూడి పరిశోధనాత్మక రచనలు, నాటకాలు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని కేసీఆర్ కొనియాడారు.
గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల సీఎం సంతాపం
గొల్లపూడి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారని మంత్రి తలసాని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
మారుతీరావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్, మంత్రి తలసాని ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఇదీ చూడండి: గొల్లపూడి జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన!