ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మోదీ గొప్ప సంపదగా తమిళిసై అభివర్ణించారు. దేశానికి ప్రధాని మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Modi Birthday: ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం కేసీఆర్ - మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో దేశానికి మరిన్నీ సేవలు అందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోదీ 71వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువకాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాని సీఎం పేర్కొన్నారు.
ఇదీ చూడండి:PM Gift Auction: వేలానికి మోదీ స్వీకరించిన కానుకలు, మెమెంటోలు