తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్​... ఎల్లుండి ప్రధానితో భేటీ.. - delhi news

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు దిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో జరిగే తాజా పరిస్థితులపై ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం.

రేపు దిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటన

By

Published : Oct 2, 2019, 1:20 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన బాట పడుతున్నారు. రేపు ఆయన దిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం 11.30 గంటలకు ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ాఆర్థిక మాంద్యం వల్ల కలుగుతున్న ఇబ్బందులతో పాటు... పలు ఇతర అంశాలపై ఆయన ప్రధానితో చర్చించనున్నారు. రాష్ట్రానికిచ్చే నిధులు పెంచడంతో పాటు.. పాత బకాయిలు త్వరగా పంపాలని ఆయన ప్రధానిని కోరనున్నారు. వీటితో పాటు ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details