తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదు: సీఈవో వికాస్​రాజ్

Telangana CEO Vikas Raj on Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్​ జారీతో నామినేషన్ల దాఖలు ప్రారంభమైందని తెలంగాణ సీఈవో వికాస్​రాజ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా ఎలాంటి నియమాలు పాటించాలో వివరించారు. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల ప్రచారాన్ని చేయాలని సూచించారు.

Telangana CEO Vikas Raj on Assembly Elections 2023
Telangana CEO Vikas Raj

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 5:51 PM IST

Updated : Nov 3, 2023, 7:32 PM IST

రైతుబంధు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదు: సీఈవో వికాస్​రాజ్

Telangana CEO Vikas Raj on Assembly Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 362 కేసులు, 256 ఎఫ్ఐఆర్​లు నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్​రాజ్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు 137 కేసులు నమోదైనట్లు తెలిపిన సీఈవో.. అందులో 13 బీఆర్ఎస్, 16 కాంగ్రెస్, 5 బీజేపీ, 3 బీఎస్పీ సంబంధిత కేసులు ఉన్నట్లు చెప్పారు. సీవిజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 2,487 ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన.. ప్రగతిభవన్​కు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల విషయమై ఈసీకి నివేదిక పంపినట్లు వివరించారు.

Telangana Assembly Elections 2023 :ఇవాళ వచ్చిన నోటిఫికేషన్​తో నామినేషన్లు ప్రారంభం అయ్యాయని, ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తారని సీఈవో పేర్కొన్నారు. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చని అయితే డిపాజిట్ మాత్రం ఒక్కదానికే చెల్లించాలని తెలిపారు. అభ్యర్థులు అఫిడవిట్​లో అన్ని కాలమ్స్ తప్పనిసరిగా నింపాలని సీఈవో స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ రెండో తేదీ వరకు రాష్ట్రంలో 3 కోట్ల 21 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని.. అక్టోబర్ 31 వరకు వచ్చిన ఓటుహక్కు దరఖాస్తులను 10వ తేదీ వరకు పూర్తి చేస్తామని చెప్పారు.

CEO Vikas Raj on Telangana Elections 2023 : 'రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమలు.. అభ్యర్థులు అవి తెలపకపోతే నామినేషన్ల తిరస్కరణే'

'నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. ఆదివారం మినహా అన్ని రోజుల్లో నామినేషన్ల స్వీకరిస్తాం. ఈనెల 10 తర్వాత ఓటరు స్లిప్పుల పంపిణీ చేపడతాం. ఇప్పటికే 2 వేల పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేస్తున్నాం. ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. 18 వేల వీల్‌చైర్లు ఏర్పాటు చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. ఈసారి పట్టణ ప్రాంతాల్లోనూ ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు. రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల మంది యువత ఓటు నమోదు చేసుకున్నారు.' -వికాస్​రాజ్, తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి

CEO Vikas Raj on Telangana Rythu Bandhu :ఈనెల 10వ తేదీ తర్వాత ఓటర్ల అనుబంధ జాబితా ప్రకటించి ఆ తర్వాత ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు ముందుగానే పంపిణీ చేస్తామని వికాస్​రాజ్ తెలిపారు. 289 కేంద్రాల్లో ఓటర్లు 1500కు పైగా ఉన్నారని.. ఓటర్ల అనుబంధ జాబితా తర్వాత కొన్ని పోలింగ్ కేంద్రాలు పెరుగుతాయని వివరించారు. మొత్తం 205 చెక్ పోస్టులు ఉన్నాయని.. ఇప్పటి వరకు రూ.453 కోట్లకు పైగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జిల్లా కమిటీల ద్వారా త్వరగా విడుదల చేయాలని చెప్పామన్న ఆయన.. వీలైనంత వరకు సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు.

ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఈసీ ధ్యేయమని.. రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రైతుబంధు విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్పారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి విషయంలో పోలీసుల నుంచి నివేదిక వచ్చిందని.. అభ్యర్థుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వికాస్​రాజ్ తెలిపారు. రాష్ట్రానికి 375 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నట్లు పేర్కొన్నారు.

Telangana Chief Electoral Officer Vikas Raj Interview : 'ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూస్తాం'

CEO Vikas Raj on Election Arrangements : 'ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగింది.. అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం'

Last Updated : Nov 3, 2023, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details