తెలంగాణ

telangana

ETV Bharat / state

Drinking Water: ఓఆర్​ఆర్​ ఫేజ్‌-2కు ప్రభుత్వం పచ్చజెండా... రూ.1200 కోట్లతో రంగం సిద్ధం - మంచినీటి సమస్యకు పరిష్కారం

త్వరలో నగర శివార్లలోని కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు సమృద్ధిగా తాగునీరు అందనుంది. అవుటర్‌ రింగ్‌రోడ్డు ఫేజ్‌-2 ప్రాజెక్టులో భాగంగా తాగునీటి పైపులైన్ల విస్తరణ, కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్‌ పచ్చజెండా ఊపడంతో తాగు జలాల పంపిణీకి మార్గం సుగమమైంది.

Drinking Water
మంచి నీటి సమస్యకు పరిష్కారం

By

Published : Jul 14, 2021, 7:01 AM IST

హైదరాబాద్ నగర శివారు (City Outskirts)లోని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటి సమస్య (Water Problem) మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో ప్రస్తావనకు వచ్చింది. సమస్యను తక్షణమే పరిష్కరించాలన్న సీఎం (CM KCR)... ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ.1200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 12 మండలాల్లో రూ.1200 కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు. నీటిఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 137 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్లు, దాదాపు 2108 కిలోమీటర్ల మేర కొత్త సరఫరా వ్యవస్థను విస్తరించనున్నారు. మొత్తంగా అవుటర్‌ చుట్టూ పుష్కలంగా జలాలు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

ఓఆర్‌ఆర్‌ (Outer Ring Road) చుట్టూ ఉన్న 197 గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చడానికి రూ.756 కోట్లతో ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-1 ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. 164 రిజర్వాయర్లు, 2 వేల కిలోమీటర్ల మేర పైపులైన్‌ పనులు పూర్తి చేశారు. తద్వారా 1300 కాలనీలు, బస్తీల్లోని దాదాపు 10 లక్షల మందికి శుద్ధి జలాలు అందిస్తున్నారు. పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఫేజ్‌-2 ప్రాజెక్టు కూడా సిద్ధం కానుంది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

శరవేగంగా కొత్త ప్రాంతాల విస్తరణ...

అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) నిర్మాణంతో శివార్ల రూపురేఖలే మారిపోతున్నాయి. ఇప్పటికే అవుటర్‌కు అటు ఇటు ఏడు కార్పొరేషన్లు, 29 వరకు మున్సిపాలిటీలకు ఉన్నాయి. కొత్త కొత్త కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం వీటికి తాగునీటి సరఫరా (Drinking Water Supply) అనేది పెద్ద సవాలతో కూడుకున్న వ్యవహారమే. కృష్ణా మూడు ఫేజ్‌లు, గోదావరి, మంజీరా ద్వారా నిత్యం 460 మిలియన్‌ గ్యాలన్ల వరకు తాగునీటిని జలమండలి (Aquifer drinking water) సరఫరా చేస్తోంది. ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇప్పటికీ శివార్లలో మూడు రోజులకొకసారి తాగునీటిని అందిస్తున్నారు. కొత్తగా విస్తరించే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌ (ORR) చుట్టూ మెరుగైన తాగునీటి వ్యవస్థను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా తాజాగా రూ.1200 కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. త్వరలో ఓఆర్‌ఆర్‌ చుట్టూ భారీ పైపులతో రింగ్‌మెయిన్‌ (Ring Main with Heavy Pipes) ఏర్పాటు చేయనున్నారు. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో అనుసంధానించాలనేది యోచన. దీంతో నగర అవసరాలకు ఎటువైపు నుంచైనా తాగునీటిని తీసుకోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది.

ఇదీ చూడండి:Ts Cabinet: రిజిస్ట్రేషన్ రుసుమును ఏడున్నర శాతానికి పెంచుతూ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details