తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Cabinet meeting : ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై ప్రధానంగా చర్చ..!

Telangana Cabinet meeting
Telangana Cabinet meeting

By

Published : Jul 28, 2023, 1:34 PM IST

Updated : Jul 29, 2023, 8:06 AM IST

13:30 July 28

Telangana Cabinet Meeting 2023 : ఈనెల 31న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Cabinet meeting On Telangana Rains 2023 : సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న భేటీలో.. దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చ జరగనుంది. భారీవర్షాలు, వరదల పరిస్థితి, ప్రభుత్వచర్యలపై కేబినేట్ సమీక్షించనుంది. అకాల వర్షాలతో వ్యవసాయరంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ విధానాలపై చర్చించనుంది. ఉద్ధృతంగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై చర్చ సహా.. యుద్ధ ప్రాతిపదికన రహదారుల పునరుద్ధరణకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

ఆర్టీసీకి చెందిన అంశాలపై చర్చించనున్న కేబినేట్.. ఆ సంస్థ ఉద్యోగుల జీతభత్యాల పెంపు, తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. బీడీ పరిశ్రమ టేకేదార్లకు ఆసరా పింఛన్లు ఇచ్చే విషయమైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పురపాలకశాఖకు చెందిన పలు అంశాలు చర్చకు రానున్నాయి. వివిధ శాఖల్లో పోస్టుల మంజూరు సహా ఇతరత్రాలకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

Telangana Cabinet Meeting :వీఆర్​ఏల క్రమబద్దీకరణ, సర్దుబాటుపైనా.. సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ, గృహలక్ష్మీ.. బీసీ, మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థికసాయం, దళితబంధు సహా కీలకమైన పథకాల అమలు, పురోగతి, తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చ జరగనుంది. ఆర్థిక పర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వపరంగా పూర్తి చేయాల్సిన పనులపైనా మంత్రివర్గంలో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telangana Legislature Sessions2023 : గురువారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. సమావేశాల ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అంశాలు, విపక్షాలు ఎదుర్కోవడం, ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లుల ముసాయిదాపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలుపుతారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.

Record Level Rainfall Telangana : రాష్ట్రవ్యాపంగా పది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వరదల వల్ల చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు అన్ని జిల్లాలు వర్ష ప్రభావానికి బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. భారీ వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, గోదావరి వంటి నదులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి 50 అడుగులను కూడా దాటి ప్రవహించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల చరిత్రను చూస్తే.. అత్యధిక వర్షపాతం 64.9 సెంటీమీటర్లు ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఈ వర్షాలకే నమోదు అయింది.

Telangana Cabinet meeting On Crop Damage :ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్​, కరీంనగర్​, ఆదిలాబాద్​, ఖమ్మం వంటి మిగిలిన జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ఆదిలాబాద్​లో పెన్​ గంగా నది 50 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. నిర్మల్​లోని కడెం జలాశయం ప్రమాదపు అంచుల్లో ప్రవహించింది. హైదరాబాద్​లోని మూసీ నది ఉగ్రరూపం దాల్చుతూ.. నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిపోసింది. ఈ రకంగా ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం జరగడంతో జులై 31న మంత్రివర్గం ఈ విషయాలపై చర్చించేందుకు సమావేశం కానున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 29, 2023, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details