Telangana Cabinet Meeting on December 4 : డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం(Telangana Cabinet) జరగనున్నట్లు తెలంగాణ సీఎంవో పేర్కొంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ కానున్నట్లు సీఎంవో ప్రకటన జారీ చేసింది. ఆదివారం శాసనసభ ఎన్నికల(Telangana Elections) ఫలితాలు వెలువడనున్న వేళ.. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.
డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ సమావేశం : సీఎంవో - డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ సమావేశం
Published : Dec 1, 2023, 3:06 PM IST
|Updated : Dec 1, 2023, 5:01 PM IST
15:01 December 01
డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ సమావేశం : సీఎంవో
ఎన్నికల ఫలితాలు వచ్చే మరుసటి రోజే కేబినెట్‌ను ఎందుకు సమావేశ పరుస్తున్నారన్న విషయం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే ఫలితాల అనంతరం జరగాల్సిన సాధారణ ప్రక్రియలకు సంబంధించి భేటీ ఉండవచ్చని అంటున్నారు. రాష్ట్ర శాసనసభ గడువు జనవరి 16 వ తేదీ వరకు ఉంది. ఫలితాలు వెలువడిన అనంతరం అసెంబ్లీ, మంత్రివర్గానికి సంబంధించి చేయాల్సిన తీర్మానాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ అంతే - అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి : కేటీఆర్
తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశమే లేదు - ఎల్లుండి 10:30 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు : వికాస్‌రాజ్