సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. పట్టణప్రగతి నిర్వహణపై మంత్రిమండలిలో ప్రధాన చర్చ జరగనుంది. పట్టణ ప్రగతి విధివిధానాలతో పాటు నిర్వహణ తేదీల ఖరారు చేసే అవకాశం ఉంది.
ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం - telangana cabinet meet latest
హైదరాబాద్ ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలు, పట్టణప్రగతి నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్
జిల్లాల వారీగా ఈ నెల 25వరకు పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు, లక్ష్యాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈచ్ వన్ టీచ్ వన్‌పై కూడా మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రభుత్వ విధానాన్ని వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు కార్యాచరణ, పంటలకు గిట్టుబాటు ధరలపైనా చర్చించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:50 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత
Last Updated : Feb 16, 2020, 9:10 PM IST