తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - వారికి ఛాన్స్ దక్కుతుందా? - Revanth will go Delhi tomorrow meet top leaders

Telangana Cabinet Expansion 2023 : త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నాయకులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు దిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపైన హైకమాండ్‌తో చర్చించనున్నారని సమాచారం.

Revanth Reddy
Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 8:04 AM IST

త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం

Telangana Cabinet Expansion 2023 : త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో, ముందుగా పదవుల పంపిణీ ద్వారా కాంగ్రెస్ పార్టీలో జోష్‌ తేవాలని భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో(Telangana Cabinet Expansion 2023) గ్రేటర్‌ హైదరాబాద్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం.

Congress Focus on Nominated Posts :హైదరాబాద్‌ నగరంలోని నియోజకవర్గాల నుంచి హస్తం పార్టీ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు. అయినప్పటికీ నాంపల్లిలో ఓడిపోయిన ఫిరోజ్‌ఖాన్‌, మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో ఓటమి చెందినషబ్బీర్‌ అలీకి ( Shabbir Ali) మంత్రి పదవి ఓకే అయితే, ఫిరోజ్‌ఖాన్‌కు అవకాశాలు ఉండవని తెలుస్తోంది. మల్కాజిగిరి నుంచి పరాజయం చెందిన మైనంపల్లి హన్మంతరావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయనను మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవుల కోసం పోటీ - సర్దుబాటుపై స్వయంగా సీఎం రేవంత్‌ ఫోకస్

ఆదిలాబాద్‌ నుంచి గడ్డం సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ : మధుయాస్కీ(ఎల్బీనగర్‌), అంజన్‌కుమార్‌ యాదవ్‌(ముషీరాబాద్‌)లు కూడా ఎన్నికల్లో ఓటమి చెందినా, వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అంజన్‌కుమార్‌ యాదవ్, షబ్బీర్ అలీలను మంత్రులుగా అవకాశం ఇచ్చి, ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని వారి అనుచరులు అంటున్నారు. ఆదిలాబాద్‌ నుంచి గడ్డం వినోద్, వివేక్‌ సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ నెలకొంది. ఇద్దరూ దిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్‌ ధీమాతో ఉన్నారు.

బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కూడా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) పేరు పరిశీలనలో ఉంది. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవి ఇవ్వకూడదని, పార్టీ యోచిస్తున్నట్టు కూడా మరోపక్క ప్రచారం జరుగుతోంది. దాన్నే అమలు చేస్తే మాత్రం ఓటమి చెందిన వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్​ రెడ్డి

Competition for Nominated Posts in Telangana Congress :మరోవైపు హస్తం పార్టీలో పదవుల కోసం నాయకుల ప్రయత్నాలు జోరందుకున్నాయి. పదవుల కోసం నేతలు దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్సీ పదవులతోపాటు నామినేటెడ్‌ పదవుల కోసం పైరవీలు ఊపందుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన పలువురు నాయకులు దిల్లీలో మకాం వేసి పార్టీ అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వందకుపైగా ఉన్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోసం త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

తొమ్మిదిన్నరేళ్ల అస్తవ్యస్త పాలనను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం : మంత్రి జూపల్లి

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details