రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 3.144శాతం డీఏను పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఉద్యోగుల డీఏ 33.536 శాతానికి చేరుకోనుంది. ఆర్టీసీ, డీఏ సహా మొత్తం 49 అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.
ప్లాస్టిక్ నిషేధంపై కమిటీ
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు అధికారుల కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. కమిటీ నివేదిక తర్వాత ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.